Bigg Boss 9 Telugu Ramu Rathod: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో చూసేందుకు చాలా అమాయకంగా, స్వచ్ఛమైన మనసుతో కనిపించే కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా అంటే అది రాము రాథోడ్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఇతను మాట్లాడే మాటలు, ప్రవర్తించే తీరు అన్ని చిన్న పిల్లవాడు చేసినట్టుగానే అనిపిస్తుంది. ఇంత సున్నితమైన అబ్బాయి టాస్కులు ఆడగలడా అనే అనుమానం ప్రేక్షకుల్లో ఉండేది. కానీ మొన్న నామినేషన్స్ లో వాయు వేగంగా టాస్కు పూర్తి చేయడం, అదే విధంగా నిన్న రాత్రి జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో ఇతను పెట్టిన ఎఫ్ర్ట్స్ కి సెల్యూట్ చేసిన తప్పు లేదు. కంటెస్టెంట్స్ ఎక్కువగా ఇతన్ని తిరగేట్ చేశారు. తన కాళ్ళు సపోర్ట్ గా పెట్టుకోవడానికి దగ్గర్లో ఒక్క ఇనప రాడ్ కూడా లేదు. అయినప్పటికీ రెండు కాళ్ళను గోడకు ఆనించి గంటలు తరబడి ఉన్నాడు.
Also Read: అప్పట్లో ‘కాంతారా’ ని ఎవ్వరూ కొనలేదు..ఇప్పుడు ‘కాంతారా 2’ ఎంతకి అమ్ముడుపోయిందంటే!
చివరికి హౌస్ మేట్స్ అందరూ చాలు ఇక దిగిపో అని చెప్పినా కూడా దిగలేదు. తన వంతు ప్రయత్నం నూటికి నూరు శాతం చేసాడు, ఫలితంగా కంటెస్టెంట్స్ అందరి చేత చప్పట్లు కొట్టించుకునేలా చేసాడు. ఈ ఒకే ఒక్క టాస్క్ తో రాము రాథోడ్ సత్తా ఏంటో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి , అదే విధంగా ప్రేక్షకులకు కూడా తెలిసొచ్చింది. ఈ వారం అతను నామినేషన్స్ లోకి వచ్చాడు. ఓట్లు పడ్డాయి, డేంజర్ జోన్ లో అయితే లేడు కానీ, నిన్న టాస్క్ లో అతని సత్తా చూసిన తర్వాత, అతని స్థాయికి తగ్గ ఓట్లు మాత్రం పడడం లేదనేది మాత్రం వాస్తవం. కాబట్టి ఇక నుండి అయినా రాము రాథోడ్ కి మంచి ఓటింగ్ పడుతుందని ఆశిద్దాం. వాస్తవానికి రాము రాథోడ్ కి అత్యధిక ఓట్లు పడుతాయని అంతా అనుకున్నారు. కారణం అతని ఫోక్ సాంగ్స్ దేశ వ్యాప్తంగా పాపులర్ కాబట్టి, కానీ ఎందుకో అంచనాలు తప్పాయి.
బహుశా ఇతర కంటెస్టెంట్స్ లాగా ఈయన భారీ పీఆర్ టీం ని పెట్టుకోవడం లో విఫలం అయ్యాడేమో. రాము రాథోడ్ ఇదే విధంగా కొనసాగుతూ ముందుకు వెళ్తే మాత్రం తన ఫ్యాన్ బేస్ ని పెంచుకొని టాప్ 5 వరకు వెళ్లొచ్చు. మరి అంత దూరం వెళ్తాడా లేదా అనేది రాబోయే ఎపిసోడ్స్ తో తెలుస్తుంది. ఈ వారం లో అయితే ఆయన టాప్ 5 స్థానం లో ఓటింగ్ పరంగా నిలిచాడు. ఈరోజు పడిన ఎపిసోడ్ ఒక రెండు రోజుల ముందు పడుతుంటే రాము రాథోడ్ గ్రాఫ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉండేది అని అంటున్నారు విశ్లేషకులు.