Bigg Boss 9 Telugu : కోట్లాది మంది అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) ఈసారి తొందరగా మొదలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. గడిచిన సీజన్స్ కి ఈ సీజన్ కి చాలా తేడాలు ఉండబోతున్నాయట. కన్నడ లో స్వర్గం,నరకం కాన్సెప్ట్ తో గత బిగ్ బాస్ సీజన్ నడిచింది. అదే కాన్సెప్ట్ తో మన తెలుగు సీజన్ లో ఈసారి నడపబోతున్నారట. స్వర్గం అంటే నామినేషన్స్ లేని కంటెస్టెంట్స్ , అదే విధంగా నరకం అంటే నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్. స్వర్గం లో ఉండేవాళ్ళు హౌస్ లోపల ఉంటారు. నరకం లో ఉండేవాళ్ళు హౌస్ బయట ఉంటారు. ఏమి కావాలన్నా, చివరికి మంచి నీళ్లు అయినా స్వర్గం లో ఉన్న కంటెస్టెంట్స్ ని అడిగి తీసుకోవాల్సిందే. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది కదూ. మన తెలుగు లో బ్లాక్ బస్టర్ అయ్యే కాన్సెప్ట్ ఇది.
Also Read : ‘థగ్ లైఫ్’ 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..తమిళ ఇండస్ట్రీ కి చావు దెబ్బ!
అంతే కాదు ఈ సీజన్ పాల్గొనబోయే కంటెస్టెంట్స్ కూడా ఎంతో స్పెషల్. కొత్త కంటెస్టెంట్స్ తో పాటుగా పాత సీజన్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ కూడా ఉంటారు. గత సీజన్ లో పాత సీజన్లకు సంబంధించిన కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చారు. కానీ ఈసారి మాత్రం నేరుగా గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ తోనే రాబోతున్నారు. ఇకపోతే ఈ సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనడానికి ఒక నందమూరి హీరో కూడా రాబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. నందమూరి హీరో అంటే ఎన్టీఆర్(Junior NTR), కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram), బాలకృష్ణ(Nandamuri Balakrishna) రేంజ్ లో ఊహించుకోకండి. సినీ ఇండస్ట్రీ లో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క సక్సెస్ కూడా చూడలేకపోయిన నందమూరి చైతన్య కృష్ణ(Nandamuri Chaitanya Krishna) ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా హాజరు కాబోతున్నాడు. గత సీజన్ లోనే ఈయన రావాల్సింది. కానీ చివరి నిమిషం లో డ్రాప్ అయ్యాడు.
నందమూరి చైతన్య గతంలో జగపతి బాబు హీరో గా నటించిన ‘ధమ్’ అనే చిత్రం లో చిన్న పాత్ర చేసాడు. ఆ తర్వాత హీరోగా కొన్ని సినిమాలు చేసాడు కానీ, అవి విడుదలైన సంగతి నందమూరి అభిమానులకు కూడా తెలియదు. ఈయన చివరి చిత్రం ‘బ్రీత్’. ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లో కనిపించలేదు. అయితే బిగ్ బాస్ షో ద్వారా ఆడియన్స్ కి బాగా దగ్గరై,ఆ తర్వాత సినిమాల్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అనే ప్లాన్ లో ఉన్నాడట చైతన్య కృష్ణ. అందుకే ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా రాబోతున్నట్టు తెలుస్తుంది. అదే విధంగా ఈ సీజన్ కి హోస్ట్ కూడా మారిపోతాడు, నాగార్జున(Akkineni Nagarjuna) కి బదులుగా విజయ్ దేవరకొండ, లేదా నందమూరి బాలకృష హోస్ట్ గా వ్యవహరిస్తారని టాక్ వినిపించింది. అందులో ఎలాంటి నిజం లేదని ఆ తర్వాత తెలిసింది.