Thug Life 4-day Collection : కమల్ హాసన్(Kamal Haasan) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘థగ్ లైఫ్'(Thug Life) ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే ఘోరమైన డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బుక్ మై షో యాప్ లో అయితే ఆడియన్స్ రేటింగ్ 5/10 కి పడిపోయింది. ఇంత ఘోరమైన రేటింగ్స్ గడిచిన 5 ఏళ్లలో ఏ సినిమాకు రాలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘ఇండియన్ 2’ చిత్రానికి కూడా ఇంతకంటే ఎక్కువ రేటింగ్స్ వచ్చాయి. ఇక బుక్ మై షో యాప్ లో అయితే గంటకు వెయ్యి టిక్కెట్లు మాత్రమే ప్రస్తుతం అమ్ముడుపోతున్నాయి. కానీ కమల్ హాసన్, శింబు(Silambarasan TR) కాంబినేషన్ అవ్వడం, దానికి తోడు మణిరత్నం(Maniratnam) దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ఈ సినిమా పై అంచనాలు భారీ గా ఉండడం వల్ల మొదటి వీకెండ్ ఓపెనింగ్ వసూళ్లు మాత్రం బాగానే వచ్చాయి.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం అన్ని భాషలకు కలిపి ఈ చిత్రానికి మొదటి వీకెండ్ వరల్డ్ వైడ్ గా 81 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కర్ణాటక లో ఈ సినిమాని బ్యాన్ చేయడం వల్ల చాలా ఓపెనింగ్ మిస్ అయ్యింది. లేకుంటే 90 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని ఈపాటికి దాటి ఉండేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. అన్ని ప్రాంతాలతో పోలిస్తే ఈ చిత్రం ఓవర్సీస్ లో మొదటి వీకెండ్ దంచికొట్టేసింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అక్కడి ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఓవర్సీస్ లో మొదటి వీకెండ్ 40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. అంటే అమెరికన్ డాలర్స్ తో లెక్క వేస్తె 4.67 మిలియన్ డాలర్స్ అన్నమాట. తమిళనాడు లో కూడా ఇంత గ్రాస్ వసూళ్లు రాకపోవడం గమనార్హం.
Also Read : ‘థగ్ లైఫ్’ 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఓవర్సీస్ లో కలెక్షన్స్ అదిరిపోయాయిగా!
తమిళనాడు లో మొదటి వీకెండ్ 33 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా తెలుగు రాష్ట్రాల నుండి 3 కోట్ల 40 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా హిందీ కలుపుకొని 2 కోట్ల 30 లక్షలు, కేరళలో 2 కోట్ల 22 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తాయి కానీ, బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం అసాధ్యమే. అంతే కాదు, కనీసం బయ్యర్స్ కి ఈ చిత్రం 60 కోట్ల రూపాయిల నష్టాన్ని చేకూరుస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇంత పెద్ద ఫ్లాప్ కమల్ హాసన్ మళ్ళీ కావాలన్నా దక్కదని, ఇక మీదట ఆయన జాగ్రత్త పడకపోతే కెరీర్ డేంజర్ లో పడే అవకాశం ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు, చూడాలి మరి.