Bigg Boss 9 Telugu Ayesha: గత వారం ఫైర్ స్ట్రోమ్ గా బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి అడుగుపెట్టిన వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్ లో యూత్ ఆడియన్స్ ని బాగా ఆకర్షించిన వారిలో ఒకరు అయేషా. హౌస్ లో ఈమె తనూజ రేంజ్ అందగత్తె అని, చూసేందుకు ఎంతో క్యూట్ గా ఉందని, తమిళ బిగ్ బాస్ లో ఈమె 60 రోజులకు పైగానే కొనసాగిందని, తెలుగు బిగ్ బాస్ లో కూడా దుమ్ము లేపేస్తుందని ఈమెపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగా, నామినేషన్స్ సమయం లో తనూజ ని సరైన గన్ పాయింట్స్ తో నామినేట్ చేసి శభాష్ అనిపించుకుంది. తనూజ కూడా ఆరోజు ఈమెకు ఇచ్చి పారేసింది అనుకోండి, అది వేరే విషయం. అయితే తనూజ ని ఈమె నామినేట్ చేసిన పాయింట్స్ లో ఒకటి, సీరియల్ హీరోయిన్ లాగా ఊరికే ఏడుస్తూ కూర్చుంటావు, అంత ఎమోషన్స్ అవసరం లేదు అనేది.
ఏ పాయింట్ తో అయితే ఆమె నామినేట్ చేసిందో, అదే పాయింట్ వద్ద నిన్న అడ్డంగా దొరికిపోయింది. కెప్టెన్సీ టాస్క్ లో ఓడిపోయినందుకు హౌస్ మొత్తం దద్దరిల్లిపోయే రేంజ్ లో ఏడ్చింది. క్రింద కూర్చిన చెంపలు వాయించుకుంది, తల బాదుకుంది. ఈమెని ఓదార్చడానికి హౌస్ మొత్తం కదిలి వచ్చింది. ఎంత ఓదార్చినా కూడా ఈమెని ఏడుపు కంట్రోల్ చేయలేకపోయారు. చివరికి బాత్రూం లోకి వెళ్లి బాగా ఏడ్చి, బయటకు వచ్చిన తర్వాత కూల్ అయ్యింది. తనూజ గేమ్స్ ఓడిపోయినప్పుడు ఏడ్చిన విషయం వాస్తవమే, కానీ ఇంత ఓవర్ డ్రామా మాత్రం చేయలేదు. తన సన్నిహితుల వద్ద ప్రతీ సారి కష్టపడుతున్నాను, కానీ ఫలితం రావడం లేదంటూ వాపోయింది. కానీ అయేషా నిన్న చేసిన అతి మామూలుది కాదు, ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఈ రేంజ్ లో ఏడవలేదు.
ఇలా తనని తాను కొట్టుకుంటూ ఆయేషా ఏడ్చిన తీరుకు నేడు నాగార్జున నుండి ఫుల్ కోటింగ్ పడిందట. షో కి వచ్చిన ఆడియన్స్ కూడా అయేషా తీరుని నచ్చలేదట. నాగార్జున అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అలా మౌనంగా నిల్చొని ఉండిపోయింది ఆయేషా. ఇదంతా పక్కన పెడితే, ఆయేషా కచ్చితంగా మంచి సత్తా ఉన్న అమ్మాయి. టాప్ 5 వరకు వెళ్లగలదు, కానీ ప్రవర్తన మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈమెకు హౌస్ లో కెప్టెన్ ఏదైనా బాధ్యత చెప్తే చాలు, నాన్ స్టాప్ గా అరవడం, గొడవలు పడడం వంటివి చేస్తుంది. ఈమె ఎంట్రీ ని మొదటి వారం స్వాగతించిన ప్రేక్షకులే, ఈమె చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది, నామినేషన్స్ లోకి వస్తే వెంటనే తరిమేయాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాబట్టి అయేషా మేలుకోవాల్సిన సమయం వచ్చింది. లేదంటే ఎంత తొందరగా వచ్చిందో, అంతే తొందరగా వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఈమె తన ఆట తీరుని ఎలా మార్చుకుంటుంది అనేది.