Bigg Boss 9 Telugu Bharani Eliminate: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి సెలబ్రిటీలు గా అడుగుపెట్టిన వారిలో టాప్ కంటెస్టెంట్ అని మనకు మొదటి రోజు నుండి అనిపించిన వారిలో ఒకరు భరణి. హౌస్ లో టాస్కులను కుర్రాళ్లతో సమానంగా ఆడుతూ, అందరితో ఎంతో మంచిగా ఉంటూ, రేలంగి మావయ్య ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. హౌస్ లోకి వచ్చిన ప్రతీ కంటెస్టెంట్ భరణి కి కనెక్ట్ అయిపోవడం, ఆయన్ని వాళ్లంతా నాన్న, అన్నయ్య అంటూ పిలవడం, బంధాలకు కనెక్ట్ అయిపోయి భరణి వాళ్ళకు మాట ఇవ్వడం,ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం ఆయన తన ఆటనే మర్చిపోవడం వంటివి ఇన్ని రోజులు మనం చూస్తూ వచ్చాము. టాప్ 5 లో కచ్చితంగా ఉండాల్సిన భరణి, బంధాల్లో చిక్కుకొని, తన ఆటని మొత్తం పాడు చేసుకున్నాడు. ఈరోజు నామినేషన్స్ లోకి వచ్చిన ఆయన, డేంజర్ జోన్ లో ఉన్నారంటే నమ్ముతారా?.
కానీ నిజంగానే ఆయన డేంజర్ జోన్ లోనే ఉన్నాడు. హౌస్ లో అందరికంటే ఆయనకే తక్కువ ఓటింగ్ వచ్చిందట. కానీ భరణి ఫీలింగ్ ఏమిటి అంటే, తానూ అందరికంటే టాప్ స్థానం లో ఉన్నానని, తనని టార్గెట్ చేసిన ప్రతీ ఒక్కరూ తన ప్రమేయం లేకుండానే ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోతున్నారని, తానూ సింహం లాంటోడిని అంటూ దివ్య తో ఒకరోజు గార్డెన్ ప్లేస్ లో చెప్తుంటాడు. ఈ వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. నెటిజెన్స్ నవ్వుకున్నారు. నిన్న గాక మొన్న ఇమ్మానుయేల్ తో కూడా వైల్డ్ కార్డ్స్ తాను టాప్ 1 స్థానం లో ఉన్నట్టు, ఇమ్మానుయేల్ రెండవ స్థానంలో, తనూజ మూడవ స్థానం లో ఉన్నట్లు తనతో చెప్పారని చెప్తాడు. ఈ వీడియో ని చూసి కూడా ఆడియన్స్ బాగా నవ్వుకున్నారు. పాపం భరణి ఊహల్లో ఉన్నాడు, ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది ఆయనే అనే విషయం తెలిస్తే ఏమైపోతాడో అని అనుకున్నారు.
కానీ ఈ వారం ఆయన నుండి పెద్దగా కంటెంట్ రాలేదు. టాస్కులు కూడా గెలవలేదు. పైగా గత వారం లో ఆడియన్స్ ‘మీ గేమ్ నచ్చడం లేదు, మిమ్మల్ని ఎలిమినేట్ చెయ్యాలని ఉంది’ అని నేరుగా భరణి కి చెప్పడం, ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని తన ప్రస్తుత పరిస్థితి ని అర్థం చేసుకున్నాడో, ఏమో తెలియదు కానీ, నిన్నటి ఎపిసోడ్ లో ఇమ్మానుయేల్ వద్దకు వచ్చి ‘నేను హౌస్ లో అందరికంటే కష్టమైన స్థానం లో ఉన్నప్పుడు, నాకోసం నువ్వు నిలబడుతావా?’ అని అడుగుతాడు. ఇది మనకు ఎపిసోడ్ లో చూపించలేదు కానీ, హాట్ స్టార్ లైవ్ లో ఈ సంఘటన జరిగింది. అంటే భరణి లో భయం మొదలైంది. రేపటి ఎపిసోడ్ లో డేంజర్ జోన్ లో భరణి, రాము ఉంటారు. ఇమ్మానుయేల్ తన వద్ద ఉన్నటువంటి పవర్ అస్త్రా ని ఉపయోగించి భరణి ని సేవ్ చేస్తాడా?,లేదంటే రాము ని సేవ్ చేస్తాడా అనేది చూడాలి. ఓటింగ్ ప్రకారం చూస్తే ఈ వారం భరణి ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది. చూడాలి మరి రేపు ఏమి జరగబోతుంది అనేది.