Bigg Boss 9 Telugu Latest Update: స్టార్ మా ఛానల్ లో ప్రతీ ఏడాది ప్రసారమయ్యే బిగ్ బాస్ సరికొత్త సీజన్ కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రేక్షకుల ఎదురు చూపులకు తగ్గట్టుగా ప్రతీ సీజన్ ని ఒక కొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు తీసుకొస్తుంటారు బిగ్ బాస్ మేకర్స్. ఈసారి కూడా అలాంటి కాన్సెప్ట్ తోనే మన ముందుకు రాబోతున్నారు. ఇన్ని రోజులు బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షో అంటే సెలబ్రిటీల మధ్యనే పోటీ ఉండేది. కానీ ఈ సీజన్ లో సామాన్యులకు,సెలబ్రిటీలకు మధ్య పోటీ జరగనుంది. ఈ ఉత్కంఠ పోరు లో సామాన్యుడు గెలుస్తాడా?, లేదా సెలబ్రిటీ గెలుస్తాడా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. సామాన్యులకు సంబంధించిన దరఖాస్తులను బిగ్ బాస్ యాజమాన్యం రీసెంట్ గానే స్వీకరించింది. వివిధ లెవెల్స్ లో ఇంటర్వూస్, టెస్టులు నిర్వహించి హౌస్ లోకి వెళ్లే అర్హత ఉన్న సామాన్యులను ఎంపిక చేస్తారు.
Also Read: దుమ్ములేపేసిన ‘కింగ్డమ్’ అడ్వాన్స్ బుకింగ్స్..ఎంత గ్రాస్ వచ్చిందంటే!
ఇప్పటికే ఆ ప్రక్రియ పూర్తి అయ్యింది. అనేక ఇంటర్వ్యూస్ తర్వాత ఒక 20 మంది సామాన్యులను ఎంపిక చేశారట. త్వరలోనే వీళ్ళకు ‘అగ్నిపరీక్ష’ అనే పోటీ ని నిర్వహించి, వివిధ గేమ్స్ ని వాళ్ళతో ఆడించి, కేవలం 9 మంది సామాన్యులను మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతారట. మరి 9 మంది అదృష్టవంతులు ఎవరో చూడాలి. ఇదంతా పక్కన పెడితే ఈ షో కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ప్రతీ సీజన్ లో ఎలిమినేషన్ ప్రక్రియ వీకెండ్ లో ఉంటుంది. ఇది కొత్తేమి కాదు, అందరికీ తెలిసిందే. కానీ ఈ సీజన్ లో మాత్రం సీజన్ మొదలైన మూడు రోజులకే ఎలిమినేషన్ ప్రక్రియ ని మొదలు పెడతారట. ఈ ప్రక్రియ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఓటింగ్ ని బట్టి ఉంటుందా..? లేదా ఆడియన్స్ ఓటింగ్ ని బట్టి ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: స్టార్ హీరో కొడుకు స్టార్ అవ్వడం లేదు.. ఇదో కొత్త ట్రెండ్..
ఒకవేళ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఓటింగ్ ద్వారా ఎలిమినేషన్ ని ఎంచుకునే ప్రక్రియ ఉంటే , కచ్చితంగా సామాన్యుడే బలయ్యే ఉంటుంది అని ఆడియన్స్ అనుకోవచ్చు. అందుకే హౌస్ లోకి 9 మంది సెలబ్రిటీలను, 9 మంది సామాన్యులను పంపుతున్నారు. అప్పుడు సరిసమానమైన ఓటింగ్ ఉంటుంది కాబట్టి, సామాన్యులకు కచ్చితంగా అన్యాయం జరిగే అవకాశం ఉండదు. అయితే సామాన్యుల ఎంపిక విషయం లో కొంత కాంట్రవర్సి ఉంది. అదేమిటంటే సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని తెచ్చుకున్న వాళ్ళను సామాన్యులుగా గత సీజన్స్ లో పంపించారు. ఈసారి కూడా అలాగే ఉంటుందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఎంత వరకు నిజం అనేది అతి త్వరలోనే తెలియనుంది.