Star Hero Son: సినిమా రంగంలో రాణించడం అంటే ఆషామాషీ కాదు. తల్లిదండ్రుల సపోర్టు అయినా ఉండాలి.. తెలిసినవారు సినిమా ఇండస్ట్రీలో అయినా ఉండాలి.. లేదా కాస్త డబ్బు ఉండాలి.. అని ఒకప్పుడు అనుకునేవారు. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీలోకి కేవలం వారసుల వరద మాత్రమే ఉండేది. దీంతో కొత్తవారికి అవకాశం తక్కువగా ఉండేది. అయితే ఎవరో కొందరు డైరెక్టర్లు కొత్త నటులతో సినిమాలు తీసి ప్రయోగం చేసేవారు. ఇవి ఒక్కసారి సక్సెస్ అయ్యేవి. దీంతో ఇండస్ట్రీకి కొత్త హీరోల పరిచయం ఏర్పడేది. అయితే కాలం మారింది. దీంతో పాటు పరిస్థితులు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు స్వర్ణ యుగంలా ఉన్న ఇండస్ట్రీ ఇప్పుడు లేదు. కాకపోతే కొత్త రక్తంతో సినీ పరిశ్రమ కొత్తదనం చూపిస్తోంది..
Also Read: నాగ చైతన్య వారసుడు హీరో కాడా… ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన అక్కినేని హీరో
ఇటీవల రిలీజ్ అయిన కొన్ని సినిమాలను చూస్తే అందులో హీరో ఎవరో కొందరికి తెలవడం లేదు. ఎందుకంటే చాలామంది డైరెక్టర్లు కొత్త వారిని పరిచయం చేస్తూ వారితో సినిమాలు తీస్తున్నారు. ప్రస్తుత ప్రేక్షకులు అంతా కేవలం కంటెంట్ నే కోరుకుంటున్నారు. హీరోల వారసులు.. తెలిసిన హీరోలు అంటూ ఏమీ లేదు. ఒకప్పుడు కొందరు స్టార్ హీరోలు.. వారి కుమారులు తీసిన సినిమాలకు ఎగబడేవారు. ఆ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి థియేటర్లోకి వచ్చేవరకు ఒక పండుగ వాతావరణం లో ఉండేది. కానీ ఇప్పుడు అడపా దడపా కొన్నిచోట్ల మాత్రమే ఆ సందడి కనిపిస్తుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత సమయం ఉంటే థియేటర్లోకి వెళ్తున్నారు.. లేకుంటే ఓటీడీలోనే చూద్దామని అనుకుంటున్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో స్టార్ హీరోల కుమారులు తమ సత్తా చాటాలని అనుకుంటున్నా.. కంటెంట్ లేకపోతే మాత్రం వారి పరిస్థితి కూడా సాధారణ హీరోలా మాదిరిగానే ఉంటుందని చర్చించుకుంటున్నారు. అయితే నేటి కాలం డైరెక్టర్లు మాత్రం కేవలం స్టార్ హీరోల కుమారులు ఉండాలని కోరుకోవడం లేదు. కొత్తవారు ఎవరైనా తమ కంటెంట్తో తమకు అనుగుణంగా మార్చుకుంటూ సినిమాలను సక్సెస్ చేసుకుంటున్నారు. ఇది ఒకరకంగా మంచికే అని కొందరు అంటున్నారు. ఎందుకంటే టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టవచ్చు అని ఆశ కలుగుతుంది. ఈ నేపథ్యంలో కొందరు ఓవర్ నైట్ స్టార్ కూడా అయ్యే అవకాశం ఉంది.
Also Read: క్రిష్ రాసిన స్టోరీ ని మేము అందుకే వాడుకోలేదు – జ్యోతి కృష్ణ
మరి స్టార్ హీరోల కుమారులు ఇండస్ట్రీలో ఏలాలని అనుకుంటే పరిస్థితి ఏంటి అని? కొందరు అంటుండగా.. ఈ రోజుల్లో స్టార్ హీరోలు.. వారి కుమారులు అంటూ ఏమీ లేదు.. సొంత ప్రతి పని నమ్ముకోవాలి అని సమాధానం ఇస్తున్నారు. అంతేకాకుండా బ్యాక్ గ్రౌండ్ తో సినిమాల్లోకి అడుగుపెడితే వారిని పెద్దగా పట్టించుకోవడంలేదని చర్చ జరుగుతుంది. కొత్తవారు అయితే తమకు అనుగుణంగా పనిచేసే అవకాశం ఉంటుంది. స్టార్లు అయితే కాస్త మర్యాద ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలోకి కొత్త డైరెక్టర్లు సైతం ఎంట్రీ ఇస్తున్నారు. వారు సైతం స్టార్ల వైపు చూడకుండా కొత్త రక్తాన్నే కోరుకుంటున్నారు. అయితే రాను రాను ఈ పరిస్థితి మరింత ఎక్కువగా మారనుంది. దీంతో ఒకప్పటి స్టార్లు తమ వారసత్వం కొనసాగించుకోవాలని అనుకుంటే సాధ్యం అవుతుందా? అని అనుకుంటున్నారు.