Kingdom Advance Bookings: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్'(Kingdom Movie) మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా గురించి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు సాధారణమైనవి కావు. విజయ్ దేవరకొండ గత చిత్రాలన్నీ ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. అయినప్పటికీ సినిమాపై ఇంత క్రేజ్ ఏర్పడడం చూస్తుంటే యూత్ ఆడియన్స్ లో ఆయనకు ఎంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. దానికి తోడు టీజర్, ట్రైలర్ వంటివి అత్యంత క్వాలిటీ తో ఉండడం, జెర్సీ వంటి అద్భుతమైన క్లాసిక్ ని ఆడియన్స్ కి అందించిన గౌతమ్ తిన్ననూరి(Gowtham Tinnanuri) ఈ చిత్రానికి దర్శకుడు అవ్వడం ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచేందుకు దోహదపడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి.
Also Read: బాలీవుడ్ లో తగ్గని ‘పుష్ప’ మేనియా.. ఈ వీడియోనే ఫ్రూఫ్
ఓవర్సీస్ లో పది రోజుల క్రితమే అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టారు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి అప్పుడే రెండు లక్షల 45 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఊపు చూస్తుంటే కచ్చితంగా 5 లక్షల డాలర్ల ప్రీ సేల్స్, టాక్ వస్తే 1 మిలియన్ డాలర్ల గ్రాస్ ప్రీమియర్ షోస్ నుండే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక హైదరాబాద్ లో కూడా నిన్నటి నుండే అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టారు. ఇక్కడ కూడా ఊహించని స్థాయి ట్రెండ్ ని ఈ చిత్రం కనబరుస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టిన ప్రతీ థియేటర్ లోనూ టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ చిత్రానికి రెండు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. చూస్తుంటే నాని ‘హిట్ 3’ ఓపెనింగ్స్ ని చాలా తేలికగా దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: ఆ స్టార్ డైరెక్టర్ తో మహేష్ 30వ సినిమా.. ఇండస్ట్రీ షేక్…
ఇంకా ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టలేదు. ఇక్కడ కూడా ఈ చిత్రానికి మంచి హైప్ ఏర్పడింది. మన టాలీవుడ్ ఆడియన్స్ ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రం కూడా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అవ్వడం తో ట్రేడ్ ఇప్పుడు ‘కింగ్డమ్’ చిత్రం మీదనే భారీ ఆశలు పెట్టుకుంది. మరి ఆ ఆశలను ఈ చిత్రం ఎంత వరకు నిలబెడుతుంది అనేది చూడాలి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 45 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, పాతిక కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కేవలం మొదటి రోజు నుండి రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.