Bigg Boss 9 Telugu Suman Shetty: ఈ బిగ్ బాస్ సీజన్ (Bigg Boss 9 Telugu)లో బాగా హైలైట్ అయిన కామెడీ ఏదైనా ఉందా అంటే ఇమ్మానుయేల్ చేసిన ‘సుమన్ శెట్టి ప్రభంజనం’ కామెడీ నే. అయితే ఇమ్మానుయేల్ కామెడీ చేసినప్పటికీ, సుమన్ శెట్టి ప్రభంజనం అనేది కొంతకాలం వరకు కొనసాగింది. ఆయన ఎలాంటి గేమ్ ఆడకపోయినా, ఎలాంటి ఎంటర్టైన్మెంట్ పంచకపోయినా కూడా, ఆడియన్స్ కి ఎందుకో అతను చాలా మంచోడు, క్యూట్ అని అనిపించాడు. అందుకే ఇన్ని రోజులు ఆయనకు ఆడియన్స్ నుండి భారీ ఓటింగ్ పడింది. కానీ ఇప్పుడు పోటీ తీవ్ర రూపం దాల్చింది. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు ఏ రేంజ్ కి వెళ్లాయంటే, ఒకరిని ఒకరు కొట్టుకునే రేంజ్ కి వెళ్లిపోయాయి. ఇలాంటి సమయంలో సుమన్ శెట్టి లాంటోళ్లను ఆడియన్స్ పట్టించుకోరు. అందుకే ఈ వారం ఆయన ఎలిమినేట్ అయ్యేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఎందుకంటే ఈ వారం నామినేషన్స్ లోకి తనూజ, భరణి, ఇమ్మానుయేల్, పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్, దివ్య, సంజన, సుమన్ శెట్టి ఉన్నారు. సుమన్ మొదటి నుండి తనూజ, భరణి కి బాగా క్లోజ్ గా ఉంటూ వస్తున్నాడు. వాళ్లిద్దరూ నామినేషన్స్ లో లేనప్పుడు సుమన్ కి ఓటింగ్ గట్టిగా పడుతూ ఉండేది. కానీ ఇప్పుడు నామినేషన్స్ లోకి ఈ వారం కెప్టెన్ గా ఉన్నటువంటి రీతూ చౌదరి తప్ప, అందరూ వచ్చేసారు. కాబట్టి సుమన్ కి ప్రస్తుతం అందరికంటే తక్కువ ఓటింగ్ పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరెవరు ఏ స్థానం లో ఉన్నారో ఒకసారి చూద్దాం. మొదటి స్థానం లో అందరూ ఊహించినట్టు గానే తనూజ కనీవినీ ఎరుగని రేంజ్ లీడింగ్ తో మొదటి స్థానం లో కొనసాగుతోంది. ఇక రెండవ స్థానం లో పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నాడు. ఇతనికి కూడా ఓటింగ్ మామూలు రేంజ్ లో పడడం లేదు.
Also Read: నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ మధ్య కొట్లాట.. పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్ లకు రెడ్ కార్డు?
ఇక పది వారాల తర్వాత 11 వ వారం లో నామినేషన్స్ లోకి అడుగుపెట్టిన ఇమ్మానుయేల్ సేఫ్ అయ్యాడు. ఈ వారం కూడా ఆయన నామినేషన్స్ లోకి వచ్చాడు. ఓటింగ్ భారీ రేంజ్ లో పడడంతో ఇమ్మానుయేల్ ప్రస్తుతానికి మూడవ స్థానం లో ఉన్నాడు. అదే విధంగా నాల్గవ స్థానం లో భరణి, 5 వ స్థానం లో డిమోన్ కళ్యాణ్, 6వ స్థానం లో సంజన, 7 వ స్థానం లో సుమన్ శెట్టి, 8వ స్థానం లో దివ్య కొనసాగుతున్నారు. దివ్య మరియు సుమన్ శెట్టి మధ్య ఓట్ల తేడా భారీగా లేదు. గంట గంటకు వీళ్లిద్దరి స్థానాలు మారుతూ వస్తున్నాయి. కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.