Bigg Boss 9 Telugu Nominations: ఈమధ్యనే మొదలైనట్టు అనిపిస్తున్న బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) చూస్తూ ఉండగానే చివరి దశకు చేరుకుంది. గత వారం ఫ్యామిలీ వీక్ ఎంతో హృద్యంగా సాగినప్పటికీ, శుక్రవారం రోజున దివ్య వెర్సస్ తనూజ మధ్య జరిగిన గొడవ ఈ సీజన్ ది బెస్ట్ ఫైట్ గా చెప్పుకోవచ్చు. డిమోన్ పవన్, రీతూ చౌదరి మధ్యలో కలగచేసుకొని దివ్య ని ఆపకపోయి ఉంటే, ఒకరిని ఒకరు జుట్టు పీక్కొని కొట్టుకునే పరిస్థితి కనిపించింది. ఆ రేంజ్ లో గొడవలు జరిగాయి. అయితే అది కేవలం టీజర్ మాత్రమే, నేడు టెలికాస్ట్ కాబోయే ఎపిసోడ్ లో నామినేషన్స్ ని చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం కాయం. తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఏడవడం ఇలాంటివన్నీ ఈరోజు నామినేషన్స్ లో మనం చూడొచ్చు. కెప్టెన్ అవ్వడం వల్ల రీతూ చౌదరి ఒక్కటే నామినేషన్స్ నుండి తప్పించుకుంది. మిగిలిన 8 మంది నామినేషన్స్ లోకి వచ్చారు.
తనూజ, పవన్ కళ్యాణ్, ఇమ్మానుయేల్, భరణి, సంజన, దివ్య, సుమన్ శెట్టి మరియు డిమోన్ పవన్ నామినేషన్స్ లోకి వచ్చారు. వీరిలో సుమన్ శెట్టి కి అందరికంటే తక్కువ ఓట్లు ప్రస్తుతానికి పడుతున్నాయి. ఈ వారం ఎలిమినేషన్ సుమన్ శెట్టి, దివ్య మధ్యలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే నేడు నామినేషన్స్ లో పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్ ల మధ్య కొట్లాట జరిగే రేంజ్ లో గొడవలు అయ్యాయి అట. వీళ్లిద్దరి మధ్యలోకి రీతూ చౌదరి కూడా రావడం తో ఈ గొడవ తారాస్థాయికి చేరిపోయింది అట. వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్ లకు రెడ్ కార్డు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదట. ఇక ఈరోజు నామినేషన్స్ లో జరిగిన అతి పెద్ద గొడవల్లో రెండవది సంజన మరియు రీతూ చౌదరి మధ్య జరిగినది అట.
Also Read: అమ్మ, కూతురు, గురువు మాటలను లెక్క చేయని భరణి..ఇక ఇతన్ని కాపాడడం దేవుడికి కూడా సాధ్యం కాదు!
రీతూ చౌదరి పై వినరాని బూతు మాటలు వదిలేసింది అట సంజన. అందుకు రీతూ చౌదరి బోరుమని ఏడ్చేసినట్టు సమాచారం. ఇక మూడవ అతి పెద్ద గొడవ దివ్య వెర్సస్ తనూజ మధ్య జరిగిందట. ఇక ఆ తర్వాత భరణి మరియు దివ్య మధ్య కూడా తారా స్థాయిలో గొడవలు జరిగాయట. ఇందాక విడుదలైన మొదటి ప్రోమో లో భరణి తనూజ పై సీక్రెట్ నామినేషన్ వేయడం చూసాము. కానీ ఓపెన్ నామినేషన్ లో ఆయన దివ్య పై వేసాడట. ఇన్ని రోజులు ఆడియన్స్ భరణి నుండి దివ్య పై ఎలాంటి ఫైర్ ని ఆశించారో, ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత అలాంటి ఫైర్ ని చూపించాడని, ఆయన గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పుకొస్తున్నారు. ఇలా నామినేషన్స్ మొత్తం తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లో ఎప్పుడూ జరగని రేంజ్ లో జరిగాయట.