Bigg Boss 9 Telugu Bharani: కాసేపటి క్రితమే విడుదలైన బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) ప్రోమో ని మీరంతా చూసే ఉంటారు. ఈ ప్రోమో లో అతి తక్కువ పాయింట్స్ ని సొంతం చేసుకున్న సుమన్ శెట్టి ని బిగ్ బాస్ తొలగిస్తూ, అతని వద్ద ఉన్న పాయింట్స్ లో సగం ఎవరో ఒక కంటెస్టెంట్ కి ఇవ్వాలని ఆదేశించగా, సుమన్ శెట్టి ఎమోషనల్ అయ్యి, ‘భరణి అన్నా..మీరే తీసుకోండి..నేను మీకే ఇస్తాను, నాకు ఇక్కడ మీరు తప్ప ఎవరున్నారు’ అని అంటాడు. అందుకు భరణి కూడా ఎమోషనల్ అవుతాడు, కానీ ఆయన ఆ పాయింట్స్ ని తీసుకోకుండా, నాకంటే ఇది సంజన గారికి బాగా ఉపయోగపడుతుంది, ఆమెకు ఇవ్వండి అనడం, సుమన్ సంజన కి ఆ పాయింట్స్ ని ఇవ్వడం, సంజన ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకోవడం, ఇదంతా చూసే ఆడియన్స్ కి చాలా ఎమోషనల్ గా అనిపించింది.
అయితే ఇలా భరణి తనకు ఇస్తానన్న పాయింట్స్ ని సంజన కి ఇవ్వడం వల్ల ఆయన డేంజర్ జోన్ లో పడ్డాడు అంటే నమ్ముతారా?, కానీ నమ్మాలి, అదే నిజం కాబట్టి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రతీ ఒక్కరు ఎక్కువ పాయింట్స్ ని ఉంచుకొని, గేమ్ లో ముందుకు వెళ్తూ రెండవ ఫైనలిస్ట్ అవ్వాలనే లక్ష్యం తో ఉంటారు. ఈ క్రమం లో ఆడకుండా, ఉచితంగా 50 పాయింట్స్ ఇస్తాను అంటే ఎవ్వరూ వద్దు అనరు. కానీ భరణి మాత్రం న్యాయం వైపే నిల్చున్నాడు. సంజన కి ఏకంగా మూడు టాస్కుల్లో ఆడేందుకు అవకాశం ఇవ్వలేదు హౌస్ లోని ఆ నలుగురు (పవన్, ఇమ్మానుయేల్, కళ్యాణ్, తనూజ). తనకు అన్యాయం జరుగుతుందని పాపం సంజన ప్రతీ రోజు ఏడుస్తూనే ఉంది. అలాంటి సమయం లో ఆమెకు భరణి అండగా నిలబడడం, భరణి కి సంజన అండగా నిలబడడం వల్ల, ఆయన కృతజ్ఞత చూపిస్తూ సంజన కి పాయింట్స్ ఇప్పించడం నిజంగా అభినందించదగ్గ విషయం.
కానీ బిగ్ బాస్ తదుపరి టాస్కు ఆడేందుకు మీలో ఒకరిని తొలగించాలి అని చెప్పినప్పుడు ఎక్కువ పాయింట్స్ తో నెంబర్ 1 స్థానం లో ఉన్న భరణి ని ఆ నలుగురు (పవన్, ఇమ్మానుయేల్, కళ్యాణ్, తనూజ) తప్పించేశారు. ఇప్పుడు ఆయన రెండు గేమ్స్ ఆడేందుకు వీలు లేదు. దీంతో ఆయన చివరి స్థానం లోకి పడిపోయాడు. మరోపక్క సంజన రెండు టాస్కులు ఆడి గెలిచి టాప్ పాయింట్స్ తో కొనసాగడం వల్ల ఆమె ఆడియన్స్ కి ఓటు అప్పీల్ చేసుకున్నట్టు సమాచారం. మంచి కోసం నిలబడితే, పాపం భరణి కి చివరికి చెడు నే ఎదురైంది. ఎవరైనా ఆయనకు వెన్నుపోటు పొడవచ్చు కానీ, నాన్న నాన్న అంటూ తిరిగే తనూజ కూడా పొడవడం అమానుషం. ఈ వారం భరణి తనూజ కి అక్షరాలా రెండు లక్షల పాయింట్స్ ని ఇచ్చాడు. అందుకు బదులుగా తనూజ నుండి తన గ్యాంగ్ ద్వారా భారానికి ఎదురైంది ఇది. ఇదంతా చూస్తున్న ఆడియన్స్ భరణి కి ఓట్లు వేసి టాప్ 5 కి పంపిస్తారా లేదా అనేది చూడాలి.