Big Shock for Akhanda 2: ఎన్నో అడ్డంకులను దాటుకొని నేడు ప్రీమియర్ షోస్ తో ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతున్న నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రానికి మరో అడ్డంకి ఏర్పడింది. తెలంగాణ లో ఈ సినిమాకు టికెట్ రేట్స్ పెంచడాన్ని వ్యతిరేకిస్తూ , ప్రభుత్వం జారీ చేసిన జీవో ని రద్దు చెయ్యాలని కోరుతూ శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి కోర్టులో నేడు పిటీషన్ దాఖలు చేసాడు. ఈ పిటీషన్ ని విచారించేందుకు న్యాయస్థానం కూడా అంగీకారం తెలిపింది. ఒకవేళ హై కోర్టు టికెట్ రేట్స్ పెంపుని నిరాకరిస్తే నిర్మాతలు భారీగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా తెలంగాణ ప్రాంతం లో నేడు షెడ్యూల్ చేసిన ప్రీమియర్ షోస్ కూడా రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలా పెద్ద సినిమాలు విడుదలకు ముందు నిర్మాతలు ప్రభుత్వాన్ని టికెట్ రేట్స్ పెంపు కొరకు రిక్వెస్ట్ చేయడం, వాళ్ళు జీవోలు జారీ చేయడం, ఆ తర్వాత ఇలా ఎవరో ఒకరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటీషన్లు వేయడం సర్వసాధారణం అయిపోయాయి.
ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రానికి కూడా ఇదే సమస్య. మరికొద్ది సేపట్లో షోస్ మొదలు అవుతాయి అనగా, ఇలాగే ఒక వ్యక్తి కోర్టు లో పిటీషన్ వేసాడు. తీర్పు రావడం ఆలస్యం అయినప్పటికీ, 5 వ రోజున టికెట్ రేట్స్ తగ్గించాలని, జీవోని తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ‘అఖండ 2’ విషయం లో కూడా అదే జరగనుండగా?, లేదా తీర్పు ఈరోజే వెలువడి, జీవో ని వెనక్కి తీసుకోమని కోర్టు ఆదేశిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. నేడు రాత్రి 8 గంటల నుండి తెలంగాణ లో ప్రీమియర్ షోస్ మొదలు అవుతాయి. ఈ ప్రీమియర్ షోస్ టికెట్ రేట్స్ 600 రూపాయిలు కాగా, రెగ్యులర్ షోస్ కి సింగిల్ స్క్రీన్స్ లో 50 రూపాయిలు, మల్టీప్లెక్స్ స్క్రీన్స్ లో 100 రూపాయిలు అదనంగా టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతిని ఇస్తూ ప్రభుత్వం నిన్న ఉదయం జీవో ని జారీ చేసింది.
ఇకపోతే మొదటిసారి కంటే, వాయిదా పడిన తర్వాత ‘అఖండ 2’ చిత్రానికి భారీ హైప్ పెరిగింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదటిసారి కంటే ఈసారి భారీగా జరుగుతున్నాయి. ఒక్క తెలంగాణ ప్రాంతం నుండే అడ్వాన్స్ బుకింగ్స్ 8 కోట్ల రూపాయిల వరకు జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సీనియర్ హీరోలలో ఇది ఆల్ టైం రికార్డు అట. బాలయ్య కి ఇలా నైజాం ప్రాంతం లో రికార్డులు రావడం చాలా అరుదు. ఈమధ్య కాలం లో సినిమాలు పెద్దగా రిలీజ్ కాకపోవడం తో మూవీ లవర్స్ కి సరైన సమయం లో అఖండ 2 దొరకడం తో ఎగబడి టికెట్స్ కొస్తున్నారు. ఇక పాజిటివ్ టాక్ వస్తే ఆకాశమే హద్దు అనే విధంగా వసూళ్లు ఉంటాయి.