Bigg Boss 9 Telugu Dimon Pawan: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu ) హౌస్ కి రెండవ కెప్టెన్ గా డిమోన్ పవన్ ఎంపిక అయ్యాడు. ఈ సందర్భంగా నిన్న ఓనర్లు మొత్తం సంబరాలు చేసుకున్నారు. అయితే నిన్నటి ఆట లో రీతూ చౌదరి డిమోన్ పవన్ కి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నట్టుగా అనిపించింది. భరణి ని అన్యాయంగా టాస్క్ నుండి ఆడించినట్టు అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ టాస్క్ పేరు ‘రంగు పడుద్ది’. ఇది గత రెండు సీజన్స్ నుండి చూస్తూనే ఉన్నాం. ఎరుపు కలర్ రంగు ఒకటి ఉంటుంది. దానిని కంటెస్టెంట్స్ తమ చొక్కాలకు అంటకుండా చూసుకోవాలి. ఏ కంటెస్టెంట్ చొక్కా కి అయితే రంగు ఎక్కువగా అంటుతుందో ఆ కంటెస్టెంట్ ఈ టాస్క్ నుండి ఎలిమినేట్ అవుతారు. అలా చివరి వరకు ఏ కంటెస్టెంట్ చొక్కా కి రంగు తక్కువగా ఉంటుందో ఆ కంటెస్టెంట్ గెలిచినట్టు లెక్క.
Also Read: ‘ఓజీ’ లో ప్రకాష్ రాజ్ కి ఇలాంటి క్యారక్టర్ ఇచ్చారా..? పవన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా!
ఈ టాస్క్ లో ఇమ్మానుయేల్, భరణి, డిమోన్ పవన్ మరియు మర్యాద మనీష్ పాల్గొన్నారు. ఇందులో ఇమ్మానుయేల్ ని ఓనర్స్ ముగ్గరు మాట్లాడుకొని ఎంచుకోగా, మిగిలిన ముగ్గురిని టెనెంట్స్ ఎంచుకున్నారు. మొదటి రౌండ్ లో మనీష్ భరణి ని ఒక రేంజ్ లో టార్గెట్ చేసి ఆయన చొక్కాకి ఎరుపు రంగు పూసేందుకు ప్రయత్నం చేసాడు. ఓనర్స్ గ్రూప్ లో ఉన్న భరణి ని ఆ రేంజ్ లో టార్గెట్ చేయడం ఏంటో, టెనెంట్స్ గ్రూప్ లో ఉన్న ఒక్క కంటెస్టెంట్ మీద కూడా ఇలాంటి టార్గెట్ చూపకపోవడం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. పూర్తిగా భరణి మీద కోపమే అతనిలో కనిపించింది. చివరికి అతనే మొదటి రౌండ్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. ఇక రెండవ రౌండ్ లో భరణి, ఇమ్మానుయేల్ కలిసి డిమోన్ పవన్ ని టార్గెట్ చేశారు. భరణి వాస్తవంగా ఇమ్మానుయేల్ ని టార్గెట్ చెయ్యాలి, కానీ ఆయన డిమోన్ ని టార్గెట్ చేసాడు.
ఇందుకు ఓనర్స్ గ్రూప్ లో ఉన్న కంటెస్టెంట్స్ భరణి ని తప్పుబడుతూ పెద్ద రచ్చ చేశారు. మనీష్ భరణి ని టార్గెట్ చేసినప్పుడు వీళ్లంతా ఏమయ్యారో మరి. అయితే రీతూ చౌదరి మాత్రం అన్యాయం గా భరణి ని రెండవ రౌండ్ నుండి తొలగించినట్టు గా అనిపించింది. భరణి కూడా ఏ గోల చేయకుండా సైలెంట్ గా తప్పుకున్నాడు. చివరికి ఇమ్మానుయేల్ మరియు డిమోన్ పవన్ మధ్య హోరాహోరీగా పోరు జరిగింది. ఇందులో కాస్త చిన్న ఎడ్జ్ తో డిమోన్ పవన్ గెలిచి ఇంటికి రెండవ కెప్టెన్ గా నిలిచాడు. ఈ టాస్క్ మొత్తం పూర్తిగా భరణి కి అన్యాయం చేసినట్టు అనిపించింది. హౌస్ లోపల ఓనర్స్ ఒక్కరు కూడా ఆయన్ని తమలో కలుపుకోవడం లేదు, వాళ్ళ కోసం ఎంత నిజాయితీగా ఆడిన పట్టించుకోవడం లేదు, ఇది ఆయనకు ఎంత నరకం గా ఉంటుందో ఊహించుకోవచ్చు.