Today 19 September 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈరోజు వ్యాపారులు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగులకు బదిలీలు ఉంటాయి. అయితే అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి సమయంలో సంయమనం పాటించాలి. ప్రియమైన వారితో ఘర్షణ వాతావరణం ఏర్పడవచ్చు. ఇతరలకు డబ్బులు ఇచ్చే సమయంలో ఆలోచించాలి. జాతర బోర్డు పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.వ్యాపారులకు ఊహించిన దాని కంటే ఈరోజు లాభాలు ఎక్కువగా ఉంటాయి. విదేశాలనుంచి శుభవార్తను వింటారు. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకుంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి ఉద్యోగులు ఈరోజు కొత్త అవకాశాలను పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలను వింటారు. విద్యార్థులు సాహితీ రంగంలో పోటీ పడితే విజయం సాధిస్తారు. వ్యాపారులకు గణనీయమైన లాభాలు వస్తాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అర్హులైన వారికి వివాహ సంబంధాలు వస్తాయి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఆకస్మాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు తోటి వారితో కలిసి కొత్త ప్రాజెక్టులను పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. దీంతో మానసికంగా సంతృప్తి చెందుతారు. వ్యాపారులు చేసే ప్రణాళికలు విజయవంతం అవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి ఉద్యోగులు ఇతరులతో పోటీ పడాల్సి వస్తుంది. అయితే అధికారుల నుంచి ఎలాంటి ఒత్తిడి లేకుండా జాగ్రత్తపడాలి. వ్యాపారులకు శత్రువుల బెడద ఉండే అవకాశం ఉంది. డబ్బు ఎవరికైనా ఇచ్చే విషయంలో జాగ్రత్తలు వహించాలి. పాత స్నేహితులను కలవడం వల్ల మనశ్శాంతి ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : నిరాశ విద్యార్థులు ఈ రోజు నైపుణ్యాన్ని ప్రదర్శించడం వల్ల గురువుల నుంచి ప్రశంశాలు పొందుతారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం పొందేందుకు మార్గం ఏర్పడుతుంది. పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. దీంతో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి ఆరోగ్యాన్ని ఈరోజు కాపాడుకోవాలి. నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. విదేశాలతో సంబంధం ఉన్నవారు ఈరోజు శుభవార్తలు వింటారు. పోటీ పరీక్షల కోసం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడంతో బిజీగా మారిపోతారు. వ్యాపారులు అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని వస్తువులు కొనుగోలు కోసం డబ్బులు ఖర్చు చేస్తారు. అయితే దుబారా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వింత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఆగిపోయిన బకాయిలు తిరిగి వస్తాయి. గతంలో చేపట్టిన కొన్ని ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల్లో చిన్న ఘర్షణ వాతావరణం ఉంటుంది. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడమే మంచిది. జీవిత భాగస్వామితో వాదనలకు దిగుతారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు సానుకూలమైన వాతావరణము ఉండనుంది. ఉద్యోగులు కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకోకుండా వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తను వింటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి వ్యాపారులకు ఈరోజు లాభాల పంట పండుతుంది. అయితే కొందరు శత్రువుల నుంచి తట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో ఆందోళన చెందకుండా ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్లాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల తో బిజీగా ఉంటారు. పూర్వీకుల ఆస్తి విషయంలో సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు అనుకున్న పనులు పూర్తి కావడంతో ఈరోజు సంతోషంగా ఉంటారు. మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. అనుకోకుండా విహారయాత్రలకు వెళ్లాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మద్దతుతో వ్యాపారులు లాభాలు పొందుతారు.