Bigg Boss 9 Telugu Mask Man: మాస్క్ మ్యాన్ హరీష్(Mask Man Harish) ని హీరో ని చేద్దామని బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) టీం ఫిక్స్ అయ్యిందా..?, అతని పై జనాల్లో సానుభూతి కలిగించి ఆయనకు వచ్చే వారం నుండి భారీ ఓటింగ్ పడేలా స్క్రిప్ట్ ని రెడీ చేశారా అంటే అవుననే అనుకోవచ్చు. శనివారం ఎపిసోడ్ లో అదే జరిగింది. వివరాల్లోకి వెళ్తే మంగళవారం జరిగిన నామినేషన్స్ ఎపిసోడ్ లో మాస్క్ మ్యాన్ హరీష్ మరియు తనూజ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఈ క్రమం లో తనూజ పై హరీష్ చేసిన వ్యాఖ్యలను తనూజ తీసుకోలేకపోయింది. ఫలితంగా ఆరోజు మొత్తం ఆమె ఏడుస్తూనే కూర్చుంది. అప్పుడు ఇమ్మానుయేల్ ఒక మాట అంటాడు ‘ఆడవాళ్ళూ మీరు తీసుకోగలరు, తిరిగి ఏమి అనలేరు అనే ధైర్యం తోనే ఆయన అన్ని మాటలు అన్నాడు. అదే నాతో మాటల యుద్ధం జరిగితే ఆయన అనే ప్రతీ మాటకు దీటైన సమాధానం చెప్పేవాడిని’ అంటాడు.
ఇది మాస్క్ మ్యాన్ హరీష్ కి వేరేలా అర్థమైంది. ఆయనకు ఎలా అర్థం అయ్యింది అంటే ‘ఆడవాళ్లతోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు హరీష్’ అన్నట్టుగా ఆయన అర్థం చేసుకున్నాడు. ప్రియా తో ఈ విషయం గురించి మాట్లాడుతూ ‘ఇమ్మానుయేల్ నేను ఆడవాళ్లతోనే మాట్లాడుతున్నాను అని ఇందాక అన్నాడు. ఇన్ని రోజులు నేను తనూజ, భరణి, ఇమ్మానుయేల్ తో ఫైట్ చేస్తున్నాను. ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలతో ఫైట్ చేస్తున్నాను అని ఇన్ని రోజులు అనుకున్నాను, కానీ ఈరోజే అర్థమైంది ముగ్గురు అమ్మాయిలతో ఫైట్ చేసానని’ అని అంటాడు. దీనిని చూసిన తర్వాత హౌస్ మేట్స్ మాత్రమే కాదు, ఆడియన్స్ కూడా తప్పుగానే అర్థం చేసుకున్నట్టు నాగార్జున హరీష్ కి అనిపించేలా చేసాడు. కానీ నిజానికి వాస్తవం అది కాదు, నేను పోరాడుతున్నది మొగవాళ్లతోనే కదా, ఆడవాళ్ళతో కాదు కదా అనే సెన్స్ తో ఆయన మాట్లాడాడు.
ఇది ఆ వీడియో ని చూసే ఎవ్వరికైనా అర్థం అవ్వుధి. ఒక్క రీతూ చౌదరి ఒక్కటే సరైన స్టాండ్ హరీష్ కోసం తీసుకొని నిలబడింది. హరీష్ కావాలని అలా అనలేదు అని నాగార్జున కి కూడా తెలుసు. కానీ వచ్చే వారం నామినేషన్స్ ని హరీష్ పై హౌస్ మేట్స్ మొత్తం వేసేలా చేసే ప్లాన్ లో భాగంగానే నాగార్జున ఇలా మాట్లాడి ఉండొచ్చని అనుకుంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే హరీష్ గొడవలు పెట్టుకునే రకం. హౌస్ మేట్స్ అందరూ అతన్ని టార్గెట్ చేస్తే బోలెడంత కంటెంట్ వస్తుంది కాబట్టి, కావాలనే ఇలా ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. మరి మీ అందరికీ ఏమని అనిపించింది?, హరీష్ నిజంగానే ఆడవాళ్లను తక్కువ చేసి మాట్లాడాడా? , లేదా ఆయన ఉద్దేశ్యం వేరునా?, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపం లో తెలియజేయండి.