Bigg Boss 9 Telugu Bharani: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో పెద్ద మనిషి లాగా ప్రవర్తిస్తున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది భరణి శంకర్(Bharani Shankar) మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సీజన్ మొదలు అవ్వకముందు ఈయన హౌస్ లోకి ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టబోతున్నాడు అనే వార్త వచ్చినప్పుడు, ఇతన్ని ఎందుకు తీసుకోవడం?, మిగిలిన కంటెస్టెంట్స్ తో పోలిస్తే వయస్సు లో చాలా పెద్ద, వాళ్ళతో పోటీ పడి ఆడలేడు ,మొదటి వారం లోనే ఎలిమినేట్ అయిపోతాడు అని అంతా అనుకున్నారు. కానీ స్టేజి మీదకు వచ్చిన రోజే తెలిసింది,ఇతను ఎంత స్ట్రాంగ్ ప్లేయర్ అనేది. కుర్రాడు అయినటువంటి డిమోన్ పవన్ తో సమానంగా పుషప్స్ చేసినప్పుడే అబ్బో అని అనుకున్నారు అందరూ. హౌస్ లోకి వచ్చిన తర్వాత కూడా అందరితో ఎంతో మంచిగా ఉంటూ, సరదాగా ఉండాల్సిన సమయం లో సరదాగా ఉంటూ, గొడవ పడాల్సిన సమయం లో గొడవ పడుతూ చాలా స్ట్రాంగ్ ప్లేయర్ లాగా అనిపించాడు.
అంతే కాదు, తనకు సంబంధం ఉన్న విషయం అయినా కాకపోయినా, ప్రతీ దాంట్లోనే తన వాయిస్ ని వినిపించడంలో భరణి ఎక్కడా వెనకడుగు వెయ్యలేదు. అందుకే హౌస్ మేట్స్ లో అత్యధిక శాతం ఆయన్ని ఇంటి పెద్దగానే చూస్తుంటారు. అందుకేనేమో ఇప్పుడు ఆయన శాశ్వత ఓనర్ గా మారిపోయాడు. నిన్నటి ఎపిసోడ్ చివర్లో ఇమ్మానుయేల్ ని, భరణి ని రెండు జట్లుగా డివైడ్ చేసి, ఇమ్మానుయేల్ వైపు సంజన, రీతూ, సుమన్ ఉంటారు. అదే విధంగా భరణి వైపు శ్రేష్టి వర్మ, తనూజ,రాము ఉంటారు. ఈ రెండు గ్రూప్స్ మీద రేపు ఏదైనా టాస్క్ పెడతారేమో, గెలిచిన టీం కి సంబంధించిన లీడర్ ఇంటికి శాశ్వత ఓనర్ గా మారుతాడు. భరణి టీం ఈ టాస్క్ లో గెలిచి ఉంటుంది, అందుకే ఆయన ఈ ఇంటికి శాశ్వత ఓనర్ అవుతాడు.
కేవలం శాశ్వత ఓనర్ అవ్వడం మాత్రమే కాదు, ఆయనకు కొన్ని స్పెషల్ పవర్స్ ని కూడా ఇచ్చాడట నాగార్జున. ఆ పవర్స్ తో ఏమేమి చేయొచ్చు అనేది రేపటి ఎపిసోడ్ లో చూసి తెలుసుకోవాల్సిందే. ఆయనకు ఉన్నటువంటి ఆ స్పెషల్ పవర్స్ తో టెనెంట్స్ గా ఉన్నవాళ్లను ఓనర్స్ గా మార్చవచ్చు, అదే విధంగా ఓనర్స్ గా ఉన్నవాళ్ళని టెనెంట్స్ గా మార్చవచ్చు . ఎందుకంటే ఆయన శ్వాసత ఓనర్ కాబట్టి, ఆ ఇంటి పై ఆయనకు మాత్రమే పూర్తి హక్కులు ఉంటాయి. మరి ఈయన ఓనర్ అయ్యాక హౌస్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ?, ఇన్ని రోజులు ఆడియన్స్ కి పెద్ద మనిషి గా, మంచి మనిషి గా అనిపించిన భరణి లో కొత్త యాంగిల్స్ ఏమైనా బయటకు వస్తాయా అనేది చూడాలి.