Bigg Boss 9 Telugu Sanjana: బిగ్ బాస్ షోలో ప్రతి ఒక్క కంటెస్టెంట్ తనదైన రీతిలో పర్ఫామెన్స్ ని ఇస్తూ ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఎవరికి వాళ్లు స్వతహాగా ఒక స్ట్రాటజీని మైంటైన్ చేస్తూ గేమ్ ని ఆడుతున్నారు. అలాగే బిగ్ బాస్ కండక్ట్ చేసే టాస్క్ లను సైతం అలాగే పూర్తి చేస్తున్నారు. దీనివల్ల కంటెస్టెంట్లలో తెలియకుండానే కొన్ని విభేదాలైతే వస్తున్నాయి. దానివల్ల ఎవరు జెన్యూన్ గా ఆడుతున్నారు, ఎవరు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారనే విషయంలో ప్రేక్షకులు జెన్యూన్ గా ఉండే వాళ్ల వైపు మాత్రమే మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల వాళ్లకు జనాలు నుంచి వచ్చే ఓటింగ్స్ కూడా పెరుగుతున్నాయి. ప్రేక్షకుల్లో వాళ్లంటే అభిమానం కూడా పెరిగిపోతోంది. అందువల్లే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లందరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని హౌస్ లో బిహేవ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడనుంది. ఇక నాలుగోవ ఎపిసోడ్లో సంజన చేసిన రచ్చ మామూలుగా లేదు. ఎవరికీ తెలియకుండా గుడ్డును దొంగలించి ఓనర్స్ అందర్నీ ఒక్కసారిగా కంగారు పెట్టింది. నిజానికి ఈ విషయంలో ఓనర్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళను నమ్మి ఒక ఇంటిని అప్పజెప్పినప్పుడు వాళ్ల ప్రమేయం లేకుండా టెనెంట్స్ ఎవరైనా సరే వచ్చి తమకి కావాల్సింది ఓనర్స్ యొక్క పర్మిషన్ తో తీసుకొని వెళ్లాలి తప్ప వాళ్లకి తెలియకుండా ఏమి తీసుకెళ్లకూడదు అనే ఒక కండిషన్ అయితే విధించారు. అలాంటప్పుడు వాళ్ళకి తెలియకుండా సంజన వచ్చి ఎగ్ తీసుకెళ్తే హౌజ్ ఓనర్స్ కి అప్పజెప్పిన బాధ్యతలో వారు పూర్తిగా ఫెయిల్ అయినట్టు అయిపోతోంది.
కాబట్టి వాళ్లు ఈ విషయాన్ని చాలా స్ట్రిక్ట్ గా తీసుకొని గుడ్డును ఎవరు దొంగిలించారో తెలిసేదాకా వదిలే ప్రసక్తే లేదు అంటూ దాన్ని చాలా వరకు రచ్చ రచ్చ చేశారు. సంజన గుడ్డు దొంగలించిన విషయం భరణి, తనుజా లకు తెలుసు… అయినప్పటికి భరణి మాత్రం తనకి తెలియదని సంజన కి ఏం తెలియదన్నట్టుగా ఫైట్ చేశాడు.
దీనివల్ల అతనికి ఇది చాలా వరకు మైనస్ అయింది. మొత్తానికైతే ఫైనల్ గా తనే సంజన ఎగ్ దొంగలించిన విషయం నాకు తెలుసని చెప్పడం సంచలనాన్ని రేపింది. ఇక అలాగే వీళ్లతో పాటు ఉన్న మిగతా టెనెంట్స్ సైతం భరణి చెప్పిన సమాధానాన్ని జీర్ణించుకోలేకపోయారు.
ఎందుకంటే అప్పటిదాకా సంజన మంచిది అన్నట్టే తను వాదిస్తూ వచ్చాడు. కానీ ఒక్కసారిగా సంజన గుడ్డు దొంగలించిన విషయం తనకు తెలుసని చెప్పడంతో అందరూ షాక్ కి గురయ్యారు…సంజన వల్ల భరణి మాత్రం చాలావరకు నష్టపోయాడనే చెప్పాలి. మరి నాగార్జున గారు ఈ విషయం మీద తన సంజాయిషీ అడిగినప్పుడు భరణి తనను తాను ఎలా ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…