Bigg Boss 9 Telugu Tanuja: బిగ్ బాస్ 9(Bigg Boss 9 Telugu) మొదలైనప్పటి నుండి గొడవలు మామూలు రేంజ్ లో ఉండడం లేదు. ప్రతీ చిన్న దానికి ఇల్లు మొత్తం ఊగిపోతోంది. చిన్న చిన్న వాటికే ఇలా అయిపోతే, రాబోయే రోజుల్లో వచ్చే పరిస్థితులను హౌస్ ఎలా ఎదురుకుంటుందో అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. కొంతమంది కంటెస్టెంట్స్ ఓవర్ గా ఆలోచిస్తూ ఏవేవో చేసేస్తున్నారు. ముఖ్యంగా ‘అగ్నిపరీక్ష’ నుండి వచ్చిన సామాన్యులు మాత్రం రెచ్చిపోతున్నారు. అందులో మాస్క్ మ్యాన్ మొదటి రోజు నుండి తన మార్క్ వేసే ప్రయత్నం చాలా గట్టిగా చేస్తున్నాడు కానీ ఎందుకో అది వర్కౌట్ అవ్వడం లేదు. కానీ నిన్న జరిగిన నామినేషన్స్ లో మాత్రం ఆయన తనూజ చేత కార్నర్ అయ్యాడు అనే అనిపించింది. తన క్యారక్టర్ ని ఉద్దేశించి చాలా నీచంగా మాట్లాడాడు అంటూ తనూజ జనాలకు చెప్తుంది.
వాస్తవానికి ఆమె కావాలని చేయడం లేదు కానీ, తెలుగు అర్థం కాక అలా మాట్లాడుతుందో, లేదా నిజంగానే ఆమె మాటలు అలా ఉన్నాయో ఆడియన్స్ కి అర్థం కావడం లేదు. ‘వంట చేసేటప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ చాలా చిరాకుగా ఉంది. ఎవ్వరితోనూ మీరు సరిగా మాట్లాడలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. నా బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు అంటూ తనూజ చాలా ఫైర్ అవుతూ మాట్లాడుతుంది. ఇక్కడి నుండే ఆమె పూర్తిగా తన సహనం కోల్పోయింది. పక్క రోజు మాస్క్ మ్యాన్ హరీష్ తనూజ వద్దకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె మాత్రం మీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు అని చెప్పుకొచ్చింది. చూస్తుంటే ఆమె చాలా మనసు బాగా నొచ్చుకున్నట్టు అనిపిస్తుంది. వీకెండ్ ఎపిసోడ్స్ లో నాగార్జున వీళ్ళ మధ్య జరిగిన ఈ గొడవలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తాడో లేదో చూడాలి.
ఇకపోతే నిన్న జరిగిన నామినేషన్స్ లో హరీష్ మరియు తనూజ మధ్య జరిగిన గొడవ కాసేపు పక్కన పెడితే, తనూజ ఓనర్స్ అందరి పాయింట్స్ కి నోరు జారకుండా సరైన సమాదానాలు చెప్పిన తీరు మాత్రం అద్భుతంగా ఉందనే చెప్పాలి. కానీ నామినేషన్స్ అయ్యాక చిన్న పిల్ల లాగా వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసింది. వాళ్ళు నా పై నామినేషన్స్ వేసినందుకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ నా క్యారక్టర్ ని తప్పుబడుతున్నారు, అక్కడే నాకు బాధవేసింది అంటూ చెప్పుకొచ్చింది. ఈమెని భరణి, ఇమ్మానుయేల్ ఓదార్చిన తీరు మాత్రం అద్భుతం అనే చెప్పాలి. ఇలాంటి స్నేహితులు కచ్చితంగా ప్రతీ ఒక్కరి వెంట ఉండాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. అయితే తనూజ గురించి తెలియని కొంతమంది ఆడియన్స్ మాత్రం ఈమె ‘వుమెన్ కార్డు’ ని ఉపయోగించి, లేని పోనీ హంగామా చేస్తుంది అంటూ ఆమెపై మండిపడుతున్నారు. కానీ సాధారణంగానే తనూజ చాలా సున్నితమైన మనిషి, గత ఎంటర్టైన్మెంట్ షోస్ లో కూడా దీనిని మనం గమనించొచ్చు.