Bigg Boss 9 Telugu: బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో ప్రస్తుతం టికెట్ టు ఫినాలే రేస్ ఎంతో రసవత్తరంగా సాగుతోంది. ఎవరు టికెట్ గెలిచి నేరుగా ఫినాలే వీక్ లోకి అడుగుపెట్టబోతున్నారు అనే అంశం పై ఆడియన్స్ లో ఉత్కంఠ మామూలు రేంజ్ లో లేదు. ఎందుకంటే ఈ టికెట్ డిమోన్ పవన్ , భరణి, రైతు చౌదరి మరియు సుమన్ శెట్టి లకు అత్యంత అవసరం. తనూజ, ఇమ్మానుయేల్, పవన్ కళ్యాణ్ లకు బలమైన ఓటింగ్ ఉంది, కానీ మిగిలిన వాళ్లకు అనుకున్నంత ఓటింగ్ లేదు, కాబట్టి టికెట్ టు ఫినాలే ఎవరికీ దక్కుతుంది అనేది ఆసక్తి గా మారింది. నిన్నటి ఎపిసోడ్ లో తనూజ టికెట్ టు ఫినాలే రేస్ నుండి ముందుగా తప్పుకోవడం మనమంతా చూసాము. ఆ తర్వాత మూడవ టాస్క్ లో భరణి, డిమోన్ పవన్ తలపడగా, భరణి గెలిచి డిమోన్ ని ఓడించి, టికెట్ టు ఫినాలే రేస్ నుండి తప్పించాడు.
ఇది ఇలా ఉండగా కాసేపటి క్రితమే విడుదలైన ప్రోమో ని మీరంతా చూసే ఉంటారు. గోడ మీద రంగులు పూసే టాస్క్ లో రీతూ చౌదరి, భరణి, కళ్యాణ్ పోటీ పడుతారు. ఈ టాస్క్ లో కళ్యాణ్ గెలిచి, తదుపరి రౌండ్ లో సుమన్ శెట్టి ని ఎంచుకొని, అతని పై గెలుస్తాడట. దీంతో సుమన్ శెట్టి కూడా టికెట్ టు ఫినాలే రేస్ నుండి తప్పుకున్నాడు. ఇక చివరికి భరణి, రీతూ చౌదరి, ఇమ్మానుయేల్ మరియు కళ్యాణ్ మిగులుతారు. కళ్యాణ్, రీతూ మరియు ఇమ్మానుయేల్ కలిసి టవర్ టాస్క్ ఒకటి ఆడుతారట. ఇందులో రీతూ చౌదరి గెలుస్తుంది అట. గెలిచిన రీతూ చౌదరి తదుపరి టాస్క్ లో భరణి తో తలపడుతుందట. ఈ టాస్క్ కి సంచాలక్ గా సంజన వ్యవహరించింది అట. ఇందులో రీతూ చౌదరి గెలిచిందని సమాచారం.
ఈ టాస్క్ చాలా వివాదాలకు దారి తీసిందని, భరణి కి అన్యాయం జరిగిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరి అది నిజమో కాదో ఈరోజు ఎపిసోడ్ తో తెలుస్తుంది. ఇదంతా పక్కన పెడితే డిమోన్ పవన్ కి బిగ్ బాస్ టీం అన్యాయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. ఈ వారం ఓటింగ్ లో ఆయన డేంజర్ జోన్ లోనే ఉన్నాడట. టికెట్ టు ఫినాలే అతను గెలిచి ఉండుంటే కచ్చితంగా సేఫ్ గా ఉండేవాడు. కానీ కావాలని బ్రిడ్జ్ టాస్క్ లో డిమోన్ పవన్ కి అన్యాయం చేసారని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. దీనిపై న్యాయ విచారణ కోసం వీకెండ్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. అంతే కాకుండా టికెట్ టు ఫినాలే గెలిచి రీతూ చౌదరి మొదటి ఫైనలిస్ట్ అయ్యిందనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.