Bigg Boss 9 Telugu Day 2: టెలివిజన్ రంగంలో అత్యంత పాపులారిటీని సంపాదించుకున్న రియాల్టీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షో అనే చెప్పాలి. ఇప్పటివరకు 8 సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు తొమ్మిదో సీజన్ ను చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేశారు. మరి ఈ షోలో సెకండ్ డే ను కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో చాలామంది వాళ్ళను వాళ్లు ఎలివేట్ చేసుకోవాలని ఏదో ఒక రకంగా యాక్టింగ్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గర అవ్వాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా అనిపించింది. కానీ ఒక ఇద్దరు మాత్రం చాలా జన్యున్ గా ఆడుతున్నట్టుగా అనిపించింది. వారు ఎవరు అంటే ఒక రీతి చౌదరి కాగా, ఇంకొకరు రాము రాథోడ్… రాము రాథోడ్ కంటెస్టెంట్స్ అందరి బట్టలు ఉతుకుతూ ఐరన్ చేస్తూ కనిపించాడు. అలాగే రీతూ చౌదరి సైతం ప్లేట్స్ క్లీన్ చేస్తూ తన ఆట తను ఆడుకుంటూ ముందుకెళ్తుంది.
అంతేతప్ప ఒకరిని డామినేట్ చేయాలని గానీ తను ఏదో నటించి ప్రేక్షకుల కంట్లో పడి ప్రేక్షకుల దగ్గర నుంచి ఓట్లు సంపాదించాలని ప్రయత్నం చేసినట్టుగాని ఎక్కడ కనిపించలేదు. దాంతో రెండోవ రోజు ప్రేక్షకుల మనసును గెలుచుకున్న వాళ్ళలో వీళ్ళిద్దరూ ప్రత్యేకంగా నిలిచారు. ఇక మరి కొంతమంది మాత్రం అవకాశం దొరికిన ప్రతిసారి వాళ్ళ స్ట్రాటజీని వాడాలనే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగారు.
మరి ఇలాంటి సందర్భంలో బిగ్ బాస్ స్టార్ట్ అయి రెండు రోజులే అవుతోంది. కాబట్టి ఇప్పుడప్పుడే ఎవరు స్ట్రాటజీ మైంటైన్ చేస్తున్నారు అనేది మనం పర్ఫెక్ట్ గా చెప్పలేము. కానీ రెండో రోజు మాత్రం రీతూ చౌదరి, రాము రాథోడ్ ఇద్దరు చాలా మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నారు. ఇదే ఇంప్రెషన్ ను ప్రేక్షకుల్లో మెయిటైన్ చేస్తూ ముందుకు సాగితే మాత్రం వీళ్లు చివరిదాకా వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి.
అలాగే టాస్క్ లను సైతం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తూ ముందుకు సాగితే వీళ్లలో ఎవరో ఒకరు బిగ్ బాస్ టైటిల్ గెలిచే అవకాశం అయితే ఉంది…ఇక ఇదిలా ఉంటే మొదటి వారం ఎలిమినేషన్ కి ఎవరు వస్తారు అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరో నాలుగు రోజుల్లో ఎలిమినేషన్ ఉండడంతో ఎవరు ఎలాంటి టాస్క్ లను ఆడుతూ ముందుకు దూసుకెళ్తారు అనేది చర్చనీయాంశంగా మారింది…