Bigg Boss 9 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో టాస్కులు రోజురోజుకి కఠినంగా మారుతున్నాయి. మొదటి ఎపిసోడ్ నుండి ఈ సీజన్ లో టాస్కులు కాస్త కొత్తగానూ, ఆసక్తికరంగా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. దానికి తగ్గట్టుగానే కంటెస్టెంట్స్ కూడా అద్భుతంగా టాస్కులు ఆడుతున్నారు. కానీ ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ లో బంధాలు ఎక్కువ అయిపోవడం తో కాస్త ఆడియన్స్ కి చిరాకు కలుగుతుంది. కనీసం వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్ లోపలకు వచ్చిన తర్వాత అయినా వీరిలో మార్పు వస్తుందో లేదో చూడాలి. వచ్చే వారం వైల్డ్ కార్డ్స్ ఫైర్ స్ట్రోమ్ లాగా హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారు అంటూ నిన్న బిగ్ బాస్ స్వయంగా తెలిపాడు. వాళ్ళను ఎదురుకొని ఎవరైతే డేంజర్ జోన్ ని తప్పించుకుంటారో వాళ్ళు సేఫ్, డెంజర్ జోన్ లో ఉన్నవాళ్లు మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ హెచ్చరిస్తాడు.
ఇందుకోసం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ రెండు జంటలుగా విడదీస్తాడు బిగ్ బాస్. ఫ్లోరా షైనీ, సంజన ఒక జట్టుగా ఏర్పడగా, సుమన్ శెట్టి, శ్రీజ ఒక జట్టుగా, తనూజ,పవన్ కళ్యాణ్ మరో జట్టుగా ఏర్పడుతారు. ముందుగా పవన్ కళ్యాణ్, శ్రీజ ఒక జట్టు అవుదాం అని అనుకున్నారు కానీ, బిగ్ బాస్ షాకింగ్ ట్విస్ట్ ఇస్తూ మన ఇద్దరిలో ఎవరో ఒకరు డేంజర్ జోన్ లోకి వెళ్లాలని చెప్తే మొదటికే మోసం వస్తుందని ఇలా వేర్వేరుగా విడిపోయారు. భరణి తో తనూజ కలవాలని చూసింది, కానీ తనూజ కంటే ముందు దివ్య భరణి ని రిక్వెస్ట్ చేసి అతనితో జత కట్టింది. ఇక చివరిగా రీతూ చౌదరి, డిమోన్ పవన్ ఒక జట్టు గా ఏర్పడ్డారు. వీళ్ళు ఎలాగో జంటగానే ఆడుతారు అనేది మన అందరికీ తెలిసిందే. మొదటి టాస్క్ లో రీతూ, డెమోన్ జంట గెలిచి వంద పాయింట్స్ ని గెలుచుకోగా, భరణి,దివ్య 80 పాయింట్స్ తో రెండవ స్థానం లో నిల్చున్నారు.
ఇక ఆ తర్వాత మూడవ స్థానం లో 70 పాయింట్స్ తో పవన్ కళ్యాణ్, తనూజ నిలబడగా, నాల్గవ స్థానంలో 60 పాయింట్స్ తో సంజన, ఫ్లోరా, 50 పాయింట్స్ తో చివరి స్థానంలో సుమన్ శెట్టి, శ్రీజ నిలిచారు. ఇక రెండవ టాస్క్ గా బెలూన్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ ఏమిటంటే జంటలలో ఎవరో ఒకరు గుండు సూది మాస్క్ ని ముఖానికి ధరించి, ఒక క్లోజెడ్ బాక్స్ లో కూర్చుంటారు. అప్పుడు లోపలకు బెలూన్స్ వేయగా అది పగలకుండా కాపాడుకోవాలి. ఈ టాస్క్ ని సంజన, ఫ్లోరా జంట తప్ప అందరూ చెత్తగా ఆడుతారు. సంచాలక్స్ గా ఉన్నటువంటి ఇమ్మానుయేల్, రాము కూడా సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో కోపం తెచ్చుకున్న బిగ్ బాస్ టాస్కు ని రద్దు చేసి, సంజన, ఫ్లోరా జంటకు తప్ప మిగిలిన వాళ్ళందరూ సంపాదించుకున్న పాయింట్స్ ని సగానికి తగ్గించేశారు. గెలవక గెలవక ఒక్క ఆట గెలిస్తే అది కూడా రద్దు అయ్యింది అంటూ సంజన బోరుమని ఏడుస్తుంది.