Bigg Boss 9 Telugu Pawan Kalyan: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షో లో టైటిల్ రేస్ నిల్చున్న కంటెస్టెంట్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతానికి రెండవ స్థానం లో ఉన్నాడు. మొదటి స్థానం లో తనూజ కొనసాగుతుంది. వీళ్లిద్దరి మధ్య ఓటింగ్ తేడా చాలానే ఉంది. అంత తేడా ఉండడానికి కారణం, పవన్ కళ్యాణ్ తనూజ తో లవ్ ట్రాక్ నడపడం వల్లే అని చెప్పొచ్చు. మొదటి మూడు వారాలు పవన్ కళ్యాణ్ నుండి ఎలాంటి కంటెంట్ రాలేదు. కేవలం అమ్మాయిల చుట్టూ తిరగడమే ఆడియన్స్ కి కనిపించింది. దీంతో మూడవ వారం ప్రియా తో పాటు డేంజర్ జోన్ లోకి వచ్చాడు. ఇద్దరి మధ్య ఓటింగ్ తేడా పెద్దగా కూడా లేదు. దాదాపుగా ఎలిమినేషన్ దగ్గరకు వెళ్లి వచ్చాడు. అప్పటి నుండి మేలుకున్న పవన్ కళ్యాణ్, టాస్కులు అద్భుతంగా ఆడుతూ, తన గ్రాఫ్ ని ఎక్కడికో తీసుకెళ్లి పెట్టుకున్నాడు.
టైటిల్ గెలుచుకునేందుకు అన్ని విధాలుగా అర్థతలు ఉన్నాయి, కానీ అమ్మాయిలతో, ముఖ్యంగా తనూజ తో పులిహోర కలపడం మానుకోవాలి. తనూజ కి కళ్యాణ్ తనని ప్రేమిస్తున్నాడని తెలుసు. ఈ విషయం ఆమెకు అర్థమై, ఒక రోజు పిలిచి కూర్చోబెట్టి తనకు అలాంటి ఫీలింగ్స్ ఏమి లేవని క్లారిటీ కూడా ఇస్తుంది. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఆమె చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు. ఇప్పటికీ అది మానుకోలేదు. అంతే కాకుండా ఆమె చేతులు వేయడం, బుగ్గలు తడమడం వంటివి ఆడియన్స్ కి అసలు నచ్చలేదు. ఒకసారి తనూజ కాస్త మూడ్ బాగాలేక ఒక దగ్గర కూర్చున్నప్పుడు, ఆమెపై చేతులు వేసి ఓదార్చే ప్రయత్నం చేసాడు. చాలా అసౌకర్యానికి గురైన తనూజ, ఇప్పుడు నేను ఏమైనా ఏడుస్తున్నానా, చెయ్యి తియ్యి అని సీరియస్ గా చెప్తుంది. ఇన్ని విధాలుగా తనకు ఇష్టం లేదని చెప్తున్నా కూడా పవన్ కళ్యాణ్ ఆమె తో ప్రవరిస్తున్న తీరు ఆడియన్స్ కి అసలు నచ్చడం లేదు.
కొత్తగా హౌస్ లోకి అడుగుపెట్టిన వైల్డ్ కార్డ్స్ లో ఒకరైన రమ్య, ఒక రోజు మాధురి తో కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడు అని అంటుంది. ఈ వీడియో ని నాగార్జున ప్లే చేసి రమ్య కి ఫుల్ కోటింగ్ ఇచ్చాడట, అంతే కాకుండా కళ్యాణ్ ని నాగార్జున కన్ఫెషన్ రూమ్ కి పిలిపించి, ఆ వీడియో ని ప్లే చేసి చూపించాడట. ఆ తర్వాత ఆడియన్స్ ని అడుగుతూ ‘రమ్య మాటలకు ఎంతమంది ఏకీభవిస్తున్నారు?’ అని పోలింగ్ పెట్టగా, 50 శాతం మంది రమ్య మాటలకు మద్దతు తెలిపారట. దీనిని బట్టీ పవన్ కళ్యాణ్ ఆడియన్స్ లో తనకు ఈ కోణం లో ఎలాంటి అభిప్రాయం ఉందో ఒక క్లారిటీ వచ్చింది. ఇంత క్లారిటీ వచ్చిన తర్వాత కూడా తన పద్దతి మార్చుకోకుండా తనూజ చుట్టూ తిరిగితే మాత్రం, కళ్యాణ్ గ్రాఫ్ టాప్ 2 నుండి పడిపోతూ వస్తూ, అసలు టాప్ 5 లోనే స్థానం కోల్పోయే అవకాశం ఉంది, చూడాలి మరి తన ఆటని కళ్యాణ్ ఎలా మెరుగుపర్చుకుంటాడు రాబోయే రోజుల్లో అనేది.
