Demon Pavan Injured: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో ఫిజికల్ టాస్కులు అద్భుతంగా ఆడే కంటెస్టెంట్ ఎవరు అని అడిగితే మన అందరికీ గుర్తుకు వచ్చే మొదటి పేరు డిమోన్ పవన్. ఇతనితో ఫిజికల్ టాస్క్ ఆడాలంటే ఎలాంటి వాడైనా భయపడాల్సిందే, ఒక బీస్ట్ లాగా ఆడేస్తాడు. అందుకే సామాన్యుడి క్యాటగిరీ లో వచ్చినప్పటికీ, ఎలాంటి పీఆర్ టీం తన వెంట లేనప్పటికీ, ఈరోజు ఆయనకు ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. 12 వ వారం వరకు సామాన్యుడి క్యాటగిరీ లో వచ్చిన కంటెస్టెంట్ కొనసాగడం అనేది సామాన్యమైన విషయం కాదు. అయితే హౌస్ లో ఈ వారం చివరి కెప్టెన్సీ టాస్క్ జరుగుతోంది. డిమోన్ పవన్ సీజన్ 5 కంటెస్టెంట్ మానస్ తో తలపడి గెలిచి, రెండవ కెప్టెన్సీ కంటెండర్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే నిన్న రాత్రి జరిగిన చివరి లెవెల్ కెప్టెన్సీ టాస్క్ లో డిమోన్ పవన్ కి తీవ్ర గాయాలు అయ్యాయట.
కాసేపటి క్రితమే విడుదలైన రెండు ప్రోమోలను మనం చూసే ఉంటాము. ఈ ప్రోమోలలో కెప్టెన్సీ కంటెండర్లు వరుసగా నిల్చుంటే, కంటెండర్ రేస్ లో లేని భరణి, తనూజ, సుమన్ శెట్టి లకు బజర్ మ్రోగినప్పుడల్లా పరుగులు తీసి, స్టాండ్ పై ఉన్న కత్తిని అందుకొని, తాము ఎవరినైతే కెప్టెన్ గా చూడాలని అనుకుంటున్నారో, వాళ్లకు కత్తి ఇవ్వాలి. అప్పుడు ఆ కంటెస్టెంట్ రేస్ లో తాను కెప్టెన్ అవ్వడానికి అడ్డుగా ఉన్న కంటెస్టెంట్ ని తొలగించాలి. ఇలా అందరూ రేస్ నుండి తప్పుకోగా, చివరికి డిమోన్ పవన్, పవన్ కళ్యాణ్ మిగులుతారు. వీళ్లిద్దరి మధ్య జరిగిన టాస్క్ లో పవన్ కళ్యాణ్ విజయం సాధించి హౌస్ కి చివరి కెప్టెన్ అయ్యినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వీళ్లిద్దరి మధ్య జరిగింది ఫిజికల్ టాస్క్ నే కానీ, హౌస్ మేట్స్ సపోర్ట్ మాత్రం కచ్చితంగా ఉండాలి.
హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అత్యధిక శాతం పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా నిలిచారు అట. డిమోన్ పవన్ కి రీతూ చౌదరి తప్ప మరో కంటెస్టెంట్ సపోర్ట్ ఇవ్వలేదు. దీంతో పవన్ ఓడిపోవాల్సి వచ్చింది. అయితే ఈ టాస్క్ లో డిమోన్ పవన్ చాలా తీవ్రంగా గాయపడ్డాడట. ఆయన్ని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లి అత్యవసర చికిత్స అందించారు. రెండు రోజుల పాటు ఎలాంటి టాస్కులు ఆడకుండా, పూర్తిగా బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్లు సూచించారట. మరి బిగ్ బాస్ టీం డిమోన్ పవన్ ని హౌస్ లో ఉంచుతుందా?, లేదా పంపేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఈ వారం అతన్ని బిగ్ బాస్ టీం రెడ్ కార్డు ఇచ్చి ఎలా అయినా బయటకు పంపేందుకు నిర్ణయం తీసుకున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి కాబట్టి, డిమోన్ పవన్ ని ఎలిమినేట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు.