Jailer 2 Movie Updates: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి రామటువంటి ఒక గొప్ప గుర్తింపు రజనీకాంత్ కి దక్కింది. సౌత్ సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లిన హీరోల్లో రజనీకాంత్ ఒకరు కావడం విశేషం… ‘జైలర్ 2’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా ఇండస్ట్రీని షేక్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో కొన్ని క్యామియో పాత్రలు కూడా ఉన్నాయి. గత కొన్ని రోజుల నుంచి వీటి మీద చాలా రకాల వార్తలైతే వస్తున్నాయి. తెలుగు లో బాలయ్య ఒక క్యామియో రోల్ లో నటిస్తున్నాడు. ఇక అలాగే మరొక తెలుగు హీరోని కూడా ఇందులో భాగం చేసే ప్రయత్నం చేస్తున్నారట.చివరికి రజినీకాంత్ ఒక డైలమాలో పడిపోయిన పరిస్థితుల్లో ఒక హీరో వచ్చి రజినీకాంత్ ని సేవ్ చేయాడానికి ఒక క్యారెక్టర్ ను డిజైన్ చేశారట.
అందుకోసం విజయ్ దేవరకొండ క్యామియో పోషిస్తున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని బాలయ్య ను రంగంలోకి దింపితే, యూత్ కోసం విజయ్ దేవరకొండ చేత ఆ క్యారెక్టర్ లో నటింపజేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఈ సినిమా 1000 కోట్లకు పైన కలెక్షన్స్ కొల్లగొడుతుందనే లక్ష్యంతో మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారట.
ఇక ఈ సినిమా కనక సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తే రజనీకాంత్ మరోసారి తన పంజా ను విసిరినవాడవుతాడు. లేకపోతే మాత్రం ఆయన మార్కెట్ మరింత డల్ అయిపోయే అవకాశాలైతే ఉన్నాయి… చూడాలి మరి రజనీకాంత్ ఈ సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంటాడా? లేదా అనేది…
ఇక ఈ సంవత్సరం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో చేసిన ‘కూలీ’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో రజనీకాంత్ చాలా వరకు డీలా పడిపోయాడు. అతని మార్కెట్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఇక ఇప్పుడు ‘జైలర్ 2’ సినిమాను సూపర్ సక్సెస్ గా నిలపాల్సిన అవసరమైతే ఉందని తన అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు…