Demon Pawan family tragedy: ‘బిగ్ బాస్ 9 ‘ లోకి ‘అగ్ని పరీక్ష ‘ షో ద్వారా సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చి, టాప్ 3 కంటెస్టెంట్ గా బయటకి వచ్చిన డిమోన్ పవన్ కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. షో లో ఉన్నన్ని రోజులు అతని మంచి తనానికి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా చివరి మూడు వారాల్లో ఆయనలోని కామెడీ టైమింగ్ టాప్ 3 కంటెస్టెంట్ గా నిలబెట్టింది. మొదటి వారం నుండి ఇదే రేంజ్ లో ఉండుంటే , కచ్చితంగా టైటిల్ ఆయనే గెలిచేవాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేసేవారు. బయటకు వచ్చిన తర్వాత కూడా డిమోన్ పవన్ కి ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. రీసెంట్ గానే ఆయన స్టార్ మా ఛానల్ లో రీతూ చౌదరి తో కలిసి ‘BB జోడి 2’ లో కూడా డ్యాన్స్ పెర్ఫార్మన్స్ చేసాడు.
అలా సాఫీగా సాగిపోతున్న డిమోన్ పవన్ జీవితం లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయనకు తన తండ్రి దుర్గ ప్రసాద్ అంటే ఎంత అభిమానమో మన కళ్లారా చూసాము . ఫ్యామిలీ వీక్ లో ఈయన స్టేజి మీదకు వచ్చి డిమోన్ పవన్ ని చూసి ఎంతో గర్వంగా మాట్లాడిన మాటలను ప్రేక్షకులు అంత తేలికగా మర్చిపోలేరు. రీసెంట్ గానే తన పుట్టినరోజు వేడుకలను తండ్రి తో కలిసి ఎంతో ఆనందంగా జరుపుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. కుర్రోడు మంచి సంతోషంతో ఉన్నాడు , పర్వాలేదు అని అనుకుంటున్న సమయం ఆయన తండ్రి చనిపోవడం పెద్ద ఆడియన్స్ ని పెద్ద షాక్ కి గురి చేసింది. మొన్ననే కదా డిమోన్ పవన్ పుట్టినరోజు వేడుకల్లో ఆయన తండ్రి గారు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాడు, ఇంతలోపే ఈ ఘటన ఎలా జరిగింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆశ్చర్యపోతూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: మహేష్ బాబు పై సెటైర్లు.. క్షమాపణలు చెప్పిన హరీష్ శంకర్.. వైరల్ అవుతున్న ట్వీట్..అసలు ఏమైందంటే!
చాలా కాలం నుండి పవన్ తండ్రి దుర్గాప్రసాద్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. డిమోన్ పవన్ టాప్ 3 స్థానం లో సూట్ కేసు తో బయటకు రావడానికి కారణం కూడా అదే , తన తండ్రికి వైద్యం చేయించడం కోసమే ఆయన డబ్బులు తీసుకొని బయటకు రావడానికి ఒప్పుకున్నాడు. అలాంటిది ఇప్పుడు ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో చనిపోవాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న బిగ్ బాస్ 9 కంటెస్టెంట్స్ ఇమ్మానుయేల్ , భరణి, సుమన్ శెట్టి వంటి వారు డిమోన్ పవన్ ని ఓదారుస్తూ పోస్టులు పెడుతున్నారు. బిగ్ బాస్ రివ్యూయర్స్ కూడా డిమోన్ పవన్ కి ఈ సందర్భంగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram