Bigg Boss 9 : తెలుగు ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే రియాలిటీ షోస్ లో ఒకటి బిగ్ బాస్. యూత్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ఈ రియాలిటీ షోని బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పటి వరకు 8 సీజన్స్ ని దిగ్విజయంగా పూర్తి చేసుకునం ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో, అతి 9వ సీజన్ కి సంబంధించిన కార్యక్రమాలను మొదలు పెట్టుకుంది. కంటెస్టెంట్స్ ఎలాంటి వాళ్ళను తీసుకోవాలి అనేదానిపై కసరత్తులు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు పేర్లు ఖరారు అయ్యినట్టు తెలుస్తుంది. బిగ్ బాస్(Bigg Boss Telugu 9) యాజమాన్యం మొదటి నుండి టీవీ యాంకర్, సినీ సెలబ్రిటీ, సీరియల్ ఆర్టిస్ట్స్, ఎంటర్టైన్మెంట్ షోస్ లో పాపులర్ అయిన ఆర్టిస్ట్స్, సోషల్ మీడియా సెలబ్రిటీస్ క్యాటగిరీలలో కంటెస్టెంట్స్ ని ఎంచుకుంటూ ఉంటారు. అంతే కాకుండా వివాదాల ద్వారా బాగా పాపులర్ అయ్యే వాళ్ళను కూడా ఎంచుకుంటూ ఉంటారు.
Also Read : ‘బిగ్ బాస్ 9’ హోస్ట్ గా విజయ్ దేవరకొండ..రెమ్యూనరేషన్ ఏ రేంజ్ లో ఇస్తున్నారో తెలిస్తే నోరెళ్లబెడుతారు!
గత సీజన్ లో శేఖర్ బాషా ని ఆ క్యాటగిరీలోనే ఎంచుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే ముందు ఆయన హీరో రాజ్ తరుణ్, లావణ్య వివాదం లో చొరవ తీసుకొని అనేక మీడియా చానెల్స్ లో లైవ్ డిబేట్స్ లో పాల్గొని ఎంత ట్రెండ్ అయ్యాడో మన అందరికీ తెలిసిందే. ఇతను మన షోకు బాగా ఉపయోగపడుతాడని గ్రహించి బిగ్ బాస్ యాజమాన్యం అతన్ని తీసుకుంది. ఇప్పుడు గత కొద్దిరోజులుగా అలేఖ్య చిట్టి పేరు సోషల్ మీడియా అంతటా మారుమోగిపోతుంది. కస్టమర్స్ తో ఆమె దురుసుగా మాట్లాడిన వాట్సాప్ ఆడియో రికార్డు ఒకటి లీక్ అవ్వడమే అందుకు కారణం. ఎక్కడ చూసినా అలేఖ్య కు సంబంధించిన మీమ్స్ ఇప్పుడు మామూలు రేంజ్ లో వైరల్ అవ్వడం లేదు. సినీ సెలబ్రిటీస్ కూడా ఆమె పై స్పూఫ్ వీడియోలు చేస్తున్నారు. ఇలా ఓవర్ నైట్ లో ట్రెండింగ్ టాపిక్ గా నిల్చిన అలేఖ్య(Alekhya Chitti) ని బిగ్ బాస్ టీం సంప్రదించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
రెమ్యూనరేషన్ కూడా భారీ రేంజ్ లోనే ఇవ్వడానికి సిద్దమయ్యారట. రోజుకు పాతిక వేల రూపాయిల రెమ్యూనరేషన్ ని ఈమె అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇకపోతే ఈ సీజన్ ఎప్పటి లాగానే సెప్టెంబర్ నెలలో మొదలు కానుంది. ఒకవేళ అటు ఇటు అయితే ఆగష్టు చివరి వారం నుండి మొదలు కావొచ్చు. ఈ సీజన్ నుండి హోస్ట్ గా అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ఉండరని, ఆయన స్థానంలోకి విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), లేదా దగ్గుబాటి రానా(Rana Daggubati) వంటి యంగ్ హీరోలు వచ్చే అవకాశం ఉండనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వీటిల్లో ఎంత వరకు నిజం ఉంది అనేది అధికారికంగా ఖరారు కాలేదు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 11 వరకు నాగార్జున తో కాంట్రాక్టు మీద సంతకం చేసాడట. కాబట్టి ఆయనే సీజన్ 9 కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తాడని అంటున్నారు.
Also Read : ‘బిగ్ బాస్ 9′ ప్రారంభం తేదీ వచ్చేసింది..ఈసారి పాల్గొనబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే..హోస్ట్ గా నాగార్జున అవుట్?