https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: నాగ మణికంఠ నిజస్వరూపం బట్టబయలు..అతడి తలమీద ఉన్నవి నిజమైన జుట్టు కాదా?

చూసేందుకు చాలా గ్లామర్ గా కనిపిస్తున్న మణికంఠ, మొదటి ఎపిసోడ్ లోనే తన ఫ్లాష్ బ్యాక్ ని చెప్పి ప్రేక్షకులను కన్నీటి పర్యంతం చేసాడు. ప్రస్తుతం అతన్ని హౌస్ మేట్స్ అందరూ టార్గెట్ చేయడం తో సోషల్ మీడియాలో అతనికి పాపులారిటీ బాగా పెరిగిపోయింది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 5, 2024 / 08:32 AM IST

    Bigg Boss 8 Telugu(14)

    Follow us on

    Bigg Boss 8 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో అత్యధిక శాతం మంది సోషల్ మీడియా లో పాపులారిటీ ని సంపాదించిన వారే అవ్వడం విశేషం. దీంతో గత సీజన్ ఆరంభం తో పోలిస్తే ఈ సీజన్ ఆరంభం అనుకున్నంత గొప్పగా లేదు. మొదటి రోజు నుండే గొడవలు పెట్టి హౌస్ లో హీట్ వాతావరణం పెంచేలా బిగ్ బాస్ స్క్రిప్ట్ మొదలు పెట్టింది కానీ, అది ప్రేక్షకులకు బాగా అర్థం అయిపోయింది. గత సీజన్ లాగా సహజత్వంగా ఈ సీజన్ ప్రస్తుతానికి అయితే సాగడం లేదని గడిచిన ఈ రెండు ఎపిసోడ్స్ ని చూస్తే అర్థం అవుతుంది. ఇకపోతే ఈ సీజన్ లో సోషల్ మీడియా పాపులారిటీ తో హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్ నాగ మణికంఠ. ఇతను స్టార్ మా ఛానల్ లో పలు టీవీ సీరియల్స్ కూడా చేసాడు కానీ, అనుకున్న స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు.

    చూసేందుకు చాలా గ్లామర్ గా కనిపిస్తున్న మణికంఠ, మొదటి ఎపిసోడ్ లోనే తన ఫ్లాష్ బ్యాక్ ని చెప్పి ప్రేక్షకులను కన్నీటి పర్యంతం చేసాడు. ప్రస్తుతం అతన్ని హౌస్ మేట్స్ అందరూ టార్గెట్ చేయడం తో సోషల్ మీడియాలో అతనికి పాపులారిటీ బాగా పెరిగిపోయింది. ఈరోజు అందరూ తనని నామినేట్ చేయడం తో నాకు గేమ్ ఎలా ఆడాలో తెలియడం లేదు, అంటూ ఏడుస్తూ తన నిజస్వరూపాన్ని బయట పెట్టి అందరినీ షాక్ కి గురి చేసాడు. ఇంతకీ ఆ నిజస్వరూపం మరేమిటో కాదు, అతను నెట్టి మీద ఉన్న జుట్టు నిజమైనది కాదు, విగ్ వాడుతున్నాడు అని. ఎమోషన్ లో ఆయన తన విగ్ ని పీకి అవతల పెట్టాడు, అతని లుక్ ని చూసి ప్రేక్షకులు షాక్ కి గురి అయ్యారు. తన నెట్టి మీద ముందు జుట్టు చాలా తక్కువగా ఉంది, కేవలం తాను టీవీ లో అందం గా కనిపించడం కోసం ఆ విగ్ పెట్టుకున్నాడు. ప్రేక్షకులకు ఒక్కసారీగా అతను విగ్ తీసి పక్కన వేయగానే షాక్ కి గురి అయ్యారు. ఎందుకంటే ఆ విగ్ అంతకు ముందు చాలా సహజంగా ఉండేది, అసలు విగ్ లాగానే అనిపించలేదు కాబట్టి.

    అనేక మంది కుర్రాళ్లకు చిన్న వయస్సులోనే జుట్టు విపరీతంగా రాలిపోవడం మనం చూస్తూనే ఉన్నాం, నాగ మణికంఠ వయస్సు చాలా చిన్నది అయినప్పటికీ కూడా అతనికి జుట్టు మొత్తం రాలిపోవడం గమనార్హం. ఇతని లుక్స్ చూసి మొదటి రోజు నుండే సోషల్ మీడియా లో అమ్మాయిలు ఫిదా అయిపోయారు, ఈ సీజన్ ఇతనికే సపోర్ట్ చేయాలనీ ఫిక్స్ అయినవారు చాలామంది ఉన్నారు. పాపం ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటో, నాగ మణికంఠ ని ఇదే లుక్ లో అంగీకరిస్తారా?, అతన్ని సీజన్ చివరి వరకు సపోర్ట్ చేస్తారా అనేది చూడాలి. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న నాగ మణికంఠ సేవ్ అవుతాడో లేదో కూడా చూడాలి.