https://oktelugu.com/

Prabhas : మెగా ఫ్యామిలీ కూడా చెయ్యని త్యాగాన్ని పవన్ కళ్యాణ్ కోసం చేసిన ప్రభాస్..ఇక ఫ్యాన్స్ కి పండగే!

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వం లో 'రాజా సాబ్' అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : December 16, 2024 / 08:17 AM IST

    Prabhas

    Follow us on

    Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వం లో ‘రాజా సాబ్’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన లైనప్ చాలా పెద్దది, కానీ ముందుగా ఆ లైనప్ నుండి విడుదల అవ్వబోయే సినిమా ఇదే. కామెడీ హారర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. స్టార్ హీరోలు హారర్ జానర్ సినిమాల్లో నటించడమే చాలా అరుదు. అప్పుడెప్పుడో సూపర్ స్టార్ రజినీకాంత్ చంద్రముఖి చిత్రం చేసాడు. ఆ తర్వాత మరో స్టార్ హీరో ఆ జానర్ లో నటించలేదు. ఇప్పుడు ప్రభాస్ ఆ జానర్ ని టచ్ చేసి సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో హారర్ జానర్ చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. బాలీవుడ్ లో ఈ చిత్రం క్లిక్ అయితే వసూళ్లు ఆకాశమే హద్దు అనే రేంజ్ లో ఉంటాయి.

    ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకుంటున్న ఈ సంస్థ, ఈ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తుంది. అయితే ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10 వ తారీఖున విడుదల చేస్తున్నట్టుగా ఇప్పటికే అధికారిక ప్రకటన చేసారు మేకర్స్. కానీ లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే, ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడినట్టు తెలుస్తుంది. కొన్ని సన్నివేశాలను రీ షూట్ చెయ్యాలని ప్రభాస్ పట్టుబట్టడంతో వాయిదా వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయట. షూటింగ్ ఇంకా 50 శాతం కి పైగా పూర్తి అవ్వాల్సి ఉంది. అందుకే తప్పనిసరి పరిస్థితిలో ఈ చిత్రం వాయిదా పడబోతుందట. త్వరలోనే ఈ విషయం పై అధికారికంగా క్లారిటీ ఇవ్వబోతున్నారు మేకర్స్. ఇదే కనుక జరిగితే పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం మార్చి 28న విడుదల కాబోతుంది.

    రాజాసాబ్ చిత్రం ఏప్రిల్ 10 న విడుదలైతే, ‘హరి హర వీరమల్లు’ కి కేవలం రెండు వారాలు మాత్రమే థియేట్రికల్ రన్ ఉంటుందని, రెండు వారాల్లో రెండు పాన్ ఇండియన్ సినిమాలంటే కచ్చితంగా ప్రేక్షకులు డివైడ్ అవుతారని, చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న చిత్రం, దీనికి బలమైన వసూళ్లు రావాలని అభిమానులు సోషల్ మీడియా లో అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ‘రాజాసాబ్’ చిత్రం వాయిదా పడబోతోంది అనే వార్త తెలియగానే వాళ్ళ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. ఇక ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి ఆకాశమే హద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమరావతిలో జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఒకపక్క ఉపముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపడుతూనే, మరోపక్క ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ నెల 22వ తేదీతో షూటింగ్ మొత్తం పూర్తి కానుంది.