Bigg Boss 8 Telugu: నామినేషన్స్ లో కూడా సానుభూతి వాడుకుంటున్న నాగ మణికంఠ..ఏడ్చేసిన కంటెస్టెంట్స్!

హౌస్ లో ఉన్న ప్రతీ ఒక్కరి జీవితాల్లో ఎదో ఒక విషాదం ఉండే ఉంటుంది, కానీ వాటిని వాడుకొని బిగ్ బాస్ గేమ్ ఆడి గెలుద్దాం అనుకుంటే ఒకసారి అవ్వొచ్చు, ప్రతీసారి ఆ ఫార్ములా వర్కౌట్ అవ్వదు అనేది విశ్లేషకుల అభిప్రాయం.

Written By: Vicky, Updated On : September 4, 2024 11:56 am

Bigg Boss 8 Telugu(12)

Follow us on

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ గేమ్ అంటే ఈమధ్య కంటెస్టెంట్స్ కి ఎమోషన్స్ తో ఆడియన్స్ ని ఆడుకోవడం అన్నట్టుగా మారిపోయింది. గత సీజన్ లో పల్లవి ప్రశాంత్ ఇలాంటి ఎమోషన్స్ తోనే టైటిల్ విన్నర్ అయ్యాడు. అయితే పల్లవి ప్రశాంత్ ఎమోషన్స్ ని కేవలం ఆటలో భాగంగానే వాడుకున్నాడు, కేవలం ఎమోషన్స్ మీద, సెంటిమెంట్ మీద అతను గెలవలేదు. టాస్కులు అద్భుతంగా ఆడాడు. అయితే ఈ సీజన్ లో అడుగుపెట్టిన నాగమణికంఠ కూడా పల్లవి ప్రశాంత్ దారిలోనే వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ప్రశాంత్ కంటే బలమైన ఎమోషనల్ సెంటిమెంట్ తో ఆడియన్స్ నుండి ఓట్లు గుంజుకునే ప్రయత్నాలు ఆయన మొదటిరోజు నుండే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. హౌస్ లోకి అడుగుపెట్టగానే పెట్టిన ఒక టాస్కులో నాగ మణికంఠ ఓడిపోతాడు. అంతే కాకుండా అతని ప్రవర్తన కూడా యాటిట్యూడ్ తో ఉండడం వల్ల హౌస్ లో కొంతమంది కంటెస్టెంట్స్ కి నచ్చలేదు.

అందుకే ఆయనని బయటకి పంపేందుకు నామినేట్ చేసారు. దానిని నాగమణికంఠ నాకు బిగ్ బాస్ తప్ప మరో ఛాయస్ లేదు అంటూ తన బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పడం మొదలు పెట్టాడు. నాగ మణికంఠ మిగిలిన కంటెస్టెంట్స్ లాగ బాగా పాపులర్ అయిన వ్యక్తి కాకపోవడం తో ఆడియన్స్ కి అతనిలో బేస్మెంట్ ఏర్పాటు అవ్వడానికి తన బ్యాక్ గ్రౌండ్ చెప్పుకున్నాడు, అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ ఆయన సెంటిమెంట్ మీదనే తన బిగ్ బాస్ జర్నీ ని కొనసాగించాలని అనుకుంటున్నట్టు నిన్న మొన్న జరిగిన ఎపిసోడ్స్ ని చూస్తే అర్థం అవుతుంది. నామినేషన్స్ లో అతను పొగరుగా మాట్లాడిన మాటలు, నామినేట్ చేసిన కంటెస్టెంట్స్ కి సమాధానం చెప్పే క్రమంలో నేను ఒకసారి మాత్రమే చెప్తాను, రెండవసారి చెప్పను అని అనడం, ఇవన్నీ చూస్తే బాగా ఓవర్ యాక్షన్ ఎక్కువ అయింది కదూ ?, అనే ఫీలింగ్ చూసే ప్రతీ ప్రేక్షకుడిలో కలిగింది. నేడు కూడా ఈ నామినేషన్స్ ప్రక్రియ కొనసాగగా, శేఖర్ బాషా మరియు ప్రేరణ నాగమణికంఠ ని నామినేట్ చేస్తారు. ఈ ప్రక్రియ లో కూడా అతను సానుభూతి ని వాడుకునే ప్రయత్నం చేసాడు.

హౌస్ లో ఉన్న ప్రతీ ఒక్కరి జీవితాల్లో ఎదో ఒక విషాదం ఉండే ఉంటుంది, కానీ వాటిని వాడుకొని బిగ్ బాస్ గేమ్ ఆడి గెలుద్దాం అనుకుంటే ఒకసారి అవ్వొచ్చు, ప్రతీసారి ఆ ఫార్ములా వర్కౌట్ అవ్వదు అనేది విశ్లేషకుల అభిప్రాయం. నామినేషన్స్ అనేది బిగ్ బాస్ లో ఒక ప్రక్రియ, కచ్చితంగా ఎవరినో ఒకరు నామినేట్ చేసుకోవాల్సిందే. ఈ ప్రక్రియలో బలంగా తన పాయింట్ ఏమిటో చెప్పుకోవాలి కానీ, ప్రతీ సందర్భంలోనూ సానుభూతిని వాడుకోవాలనుకుంటే కుదరదు. నాగ మణికంఠ భవిష్యత్తులో అయినా ఇది అర్థం చేసుకుంటాడో లేదో చూడాలి. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ ఆరంభం గత సీజన్ రేంజ్ లో లేదని చెప్పొచ్చు.