https://oktelugu.com/

Tollywood: టాలీవుడ్ లో అత్యంత పొట్టి హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె హైట్ తెలిస్తే షాక్ అవుతారు!

హీరోయిన్ అంటే మంచి హైట్ ఉండాలి. ఆకర్షణీయమైన శరీర ఆకృతి ఉండాలని అందరూ భావిస్తారు. కానీ ఈ నియమాలను బ్రేక్ చేస్తూ కొందరు పొట్టి హీరోయిన్స్ స్టార్స్ గా ఎదిగారు. కాగా టాలీవుడ్ లో అత్యంత పొట్టి హీరోయిన్ ఎవరో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : September 4, 2024 / 11:50 AM IST

    Tollywood(1)

    Follow us on

    Tollywood: అందమే హీరోయిన్స్ కి పెట్టుబడి. చూడగానే కట్టి పడేసే అమ్మాయిలు హీరోయిన్ గా సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇండియన్ హీరోయిన్స్ లో ఐశ్వర్య రాయ్ ని అందానికి చిరునామా గా చెప్పుకుంటారు. తేనె కళ్ళు, మంచి హైట్, నాజూకైన శరీరం ఆమెను ప్రపంచ అందగత్తెల్లో ఒకరిగా తీర్చిదిద్దాయి. సిల్వర్ స్క్రీన్ పై ఆమె చెరగని ముద్ర వేశారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని శాసించింది. శ్రీదేవి, మాధురీ దీక్షిత్, టబు అందమైన హీరోయిన్స్ గా పేరుగాంచారు.

    అయితే హీరోయిన్ కావాలంటే గొప్ప హైట్, స్లిమ్ ఫిగర్ అవసరం లేదని కొందరి నిరూపించారు. పొట్టి అమ్మాయిలు కూడా స్టార్ హీరోయిన్స్ అయ్యారు. కాగా టాలీవుడ్ లో అత్యంత పొట్టి హీరోయిన్ చెప్పుకోదగ్గ స్థాయిలో సక్సెస్ అయ్యింది. ఆమె ఎవరో కాదు నివేదా థామస్. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఈ మలయాళ భామ పరిశ్రమలో అడుగు పెట్టింది. అనంతరం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులో నివేద థామస్ మొదటి చిత్రం జెంటిల్ మెన్. నాని హీరోగా దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించారు.

    జెంటిల్ మెన్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దాంతో ఆమెకు తెలుగులో ఆఫర్స్ పెరిగాయి. నిన్ను కోరి చిత్రంలో నాని ఆమెకు మరో ఛాన్స్ ఇచ్చాడు. ఇది కూడా హిట్ అయ్యింది. జై లవ కుశ చిత్రంలో ఎన్టీఆర్ పక్కన నివేద ఆఫర్ పట్టేయడం విశేషం. జై లవకుశ చిత్రంలో ఎన్టీఆర్ త్రిబుల్ రోల్ చేశాడు. ఈ మూవీ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. చెప్పాలంటే నివేద థామస్ హీరోయిన్ గా సక్సెస్. కాగా ఆమె హైట్ కేవలం 5.1 అడుగులు మాత్రమే.

    నివేద థామస్ పరిశ్రమలో అత్యంత పొట్టి హీరోయిన్ అని చెప్పాలి. ఆమె తర్వాత స్థానంలో నిత్యా మీనన్ ఉంది. ఈమె కూడా సక్సెస్ఫుల్ హీరోయిన్. అనేక భాషల్లో చిత్రాలు చేసింది. నిత్యా మీనన్ హైట్ 5.2 అడుగులు అని సమాచారం. మరికొందరు పొట్టి హీరోయిన్స్ స్టార్స్ గా వెలుగొందారు. వారిలో సమంత, రష్మిక మందాన ఉన్నారు. సమంత తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్. ఆమెకు బాలీవుడ్ లో కూడా ఫేమ్ ఉంది.

    కాగా సమంత హైట్ కేవలం 5.2 అడుగులు మాత్రమే. ఏమాయ చేసావే మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన సమంత కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. ఒక్కో సినిమాతో ఆమె ఎదుగుతూ పోయింది. బాలీవుడ్ లో సైతం ఆమెకు ఫేమ్ ఉంది. నేషనల్ క్రష్ రష్మిక మందాన సైతం పొట్టి హీరోయిన్. ఆమె హైట్ 5.3 అడుగులు అని సమాచారం. రష్మిక ఇండియా వైడ్ పాపులారిటీ రాబట్టింది. పలు భాషల్లో చిత్రాలు చేస్తుంది.