Bigg Boss Telugu 8 Contestant Nabeel : ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 షో లో కంటెస్టెంట్స్ తో పాటుగా, బయట ఆడియన్స్ కి కూడా బాగా నచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది నబీల్ మాత్రమే. మొదటి రెండు వారాలు నబీల్ ఆట తీరు ఎలా ఉంటుందో ఆడియన్స్ కి పెద్దగా తెలియలేదు కానీ, సోనియా ని నామినేట్ చేసినప్పటి నుండి ఆయన బాగా హైలైట్ అయ్యాడు. టాస్కుల విషయం లో తన నుండి ఎంత ఇవ్వగలడో అంత ఇస్తున్నాడు, అలాగే కంటెస్టెంట్స్ అందరితో చాలా స్నేహం గా ఉంటున్నాడు, తనకి ఏదైనా తప్పు అనిపిస్తే కచ్చితంగా నిలదీసి తన గొంతుని వినిపిస్తున్నాడు. ఇలా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ కి ఉండాల్సిన లక్షణాలు మొత్తం నబీల్ లో ఉన్నాయి. అందుకే ఆయన రోజురోజుకి పెరుగుతూ పోతుంది.
ఇదే విధంగా ఆయన తన ఆట తీరుని కొనసాగిస్తే కచ్చితంగా టైటిల్ ని గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన నబీల్ మొట్టమొదట సేవ్ అయిన కంటెస్టెంట్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. శనివారం జరిగిన ఎపిసోడ్ లో హౌస్ మొత్తం నబీల్ కి హీరో ట్యాగ్ ని ఇచ్చారు. ఇదంతా పక్కన పెడితే నబీల్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టక ముందు ఒక యూట్యూబర్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఎన్నో ఎక్సక్లూసివ్ వీడియోస్ తో పాటు, షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ కూడా చేసేవాడు. సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే ఆయన, అప్పట్లో తన ప్రియురాలిని పరిచయం చేసాడు. నబీల్ పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతుండడంతో ఆయన గురించి తెలుసుకునేందుకు నెటిజెన్స్ సోషల్ మీడియా లో వెతకడం మొదలు పెట్టారు. ఆ క్రమంలో నబీల్ ప్రియురాలు ఆద్య రెడ్డి గురించి తెలిసింది. ఈమెతో కలిసి నబీల్ ఎన్నో మంచి వీడియోలు చేసాడు. ఆమెతోనే నేను ప్రేమలో ఉన్నట్టుగా ఎన్నో సందర్భాలలో తెలిపాడు. ఆమెతో కలిసున్న మధుర క్షణాలను తల్చుకుంటూ ఆమె పుట్టినరోజు నాడు కొన్ని ఫోటోలను షేర్ చేసాడు. అవి ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.
ఆ అమ్మాయిని చూసిన ప్రతీ ఒక్కరు ‘ఇంత అందంగా..క్యూట్ గా ఉందేంటి..నబీల్ నిజంగా అదృష్టవంతుడు. నేటి తరం కుర్ర హీరోయిన్స్ కి ఆద్య రెడ్డి ఏ మాత్రం తీసిపోదు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈమెది కూడా వరంగల్ అవ్వడం మరో విశేషం. నబీల్ ముస్లిం, ఆద్య రెడ్డి హిందూ, ఇలా భిన్నమైన మతాల నుండి వచ్చినప్పటికీ కూడా వీళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం ప్రశంసనీయం. నబీల్ కి ప్రియురాలు ఉంది అనే విషయం ఇప్పటి వరకు బిగ్ బాస్ లో ఎవరికీ చెప్పలేదు, అందుకే ఆయన మిగిలిన అబ్బాయిలు లాగా అమ్మాయిలతో పులిహోర కలపకుండా జెంటిల్ మ్యాన్ గా వ్యవహరిస్తున్నాడు. ఫ్యామిలీ వీకెండ్ లో ఈ అమ్మాయి నబీల్ ని కలవడానికి వస్తుందా లేదా అనేది చూడాలి.