Hyundai : హ్యుందాయ్ కారు ముందరి భాగంలో ఉన్నది ‘H’ కాదు.. అదేంటి.. దాని వెనుక కథ ఇదీ?

హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు వివిధ మోడళ్లు మార్కెట్లో ఆకర్షిస్తున్నాయి. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఎస్ యూవీలు లో బడ్జెట్ లో ఉంటాయన్న పేరు ఉంది.

Written By: NARESH, Updated On : September 29, 2024 6:00 pm

Hundai

Follow us on

Hyundai : కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. కొన్ని అవసరాల దృష్ట్యా దాదాపు సొంతంగా కారు ఉండాలని అనుకుంటున్నారు. అయితే కారు కొనే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా డ్రైవింగ్ గురించి తెలిసిన తరువాత కారు కొనడం మంచిది. లేకుంటే కొత్త కారు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఎలాంటి కారు కొనాలి? ఎక్కడ కొనాలి? అనే విషయాలను నిపుణులు లేదా ఇప్పటికే కారు వాడే నుంచి తెలుసుకోవచ్చు. కారు కొనాలని అనుకున్నప్పడు కంపెనీ గురించి కూడా తెలుసుకోవాలి. భారత మార్కెట్లో మారుతి, హ్యుందాయ్, టాటా, కియా వంటి రకరకాల కంపెనీలు ఉన్నాయి. వీటి నుంచి ఇప్పటికే పలు మోడళ్లు మార్కెట్లోకి వచ్చి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. అయితే వీటిలో హ్యుందాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా హ్యుందాయ్ కారుపై ఉండే లోగో గురించి ఆసక్తి కర విషయం మీకోసం..

దక్షిణ కొరియా కంపెనీకి చెందిన హ్యుందాయ్ కంపెనీ దేశంలోనే టాప్ 10 కార్ల జాబితాలో చోటు సంపాదించుకుంది. ఈ కంపెనీ నుంచి క్రెటా, ఎక్స్ టర్ వంటి కార్లు మార్కెట్లో మంచి గుర్తింపును సాధించాయి. దీంతో కొందరు హ్యుందాయ్ కంపెనికి ప్రత్యేకంగా అభిమానులుగా మారారు. ఈ కంపనీ నుంచి ఎప్పుడు కొత్త కారు వచ్చినా దాని గురించి తెలుసుకుంటూ ఉంటారు. అలాగే కంపెనీ గురించి కూడా పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ కారు కైనా ముందరి భాగంలో ఒక సింబల్ ఉంటుంది. మారుతి కార్లకు ‘S’ అనే లోగో ఉంటుంది. హ్యుందాయ్ కార్లకు ‘H’ అని ఉంటుంది. అయితే ఇక్కడ హ్యుందాయ్ కారుపై ఉన్న హెచ్ కాదట. అదేంటంటే?

ఒక కారుకు లోగో ఎంతో ముఖ్యం. ఈ లోగో ఆధారంగా ఆ కారు కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. హ్యుందాయ్ కార్లపై కూడా ‘H’ సింబల్ కనిపిస్తుంది. కానీ హ్యుందాయ్ అనగానే దాని మొదటి అక్షరం హెచ్ అని అనుకుంటున్నారు. వాస్తవానికి ఇది హెచ్ కాదని తేలిపోయింది. ఇది ఇద్దరు మనుషులు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. దీనికి సంబంధించిన లోగో ఇలా మారిపోయింది. అయితే ఇది పూర్తిగా కనిపించకపోయినా లోగో అసలు స్వరూపం అదేనట. కానీ అలా కాకుండా హెచ్ మాదిరిగా తయారు చేసి లోగోను ఫిక్స్ చేశారు. అది అలాగే కంటిన్యూ అవుతుంది.

అలాగే హ్యుందాయ్ కార్లపై ఉండే లోగో ఎప్పటికీ సిల్వర్ కలర్లో ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇది అప్డేట్ అవుతూ ఉంటుందని అర్థం చేయడానికే ఇలాంటి కలర్ పెట్టారట. అయితే అన్ని కార్లకు ఇదే కలర్లో ఉంటాయి. ఇక హ్యుందాయ్ దేశంలోని టాప్ 10 కార్లలో ఒకటిగా ఉంటుంది. ఈ కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ కార్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు వివిధ మోడళ్లు మార్కెట్లో ఆకర్షిస్తున్నాయి. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఎస్ యూవీలు లో బడ్జెట్ లో ఉంటాయన్న పేరు ఉంది.