Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ తెలుగు 7లో సరికొత్తగా బిగ్ బాస్ 2.0 ని గత ఆదివారం గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఐదుగురు సెలెబ్రెటీస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆట మరింత ఆసక్తికరంగా మారింది. ఈ రోజు ఎపిసోడ్లో ఎవరు స్మార్ట్ అనే విషయం తెలుసుకోవడానికి ఆటగాళ్లు,పోటుగాళ్ళు మధ్య ఒక పోటీ పెట్టాడు బిగ్ బాస్.ఇప్పటి వరకు బిగ్ బాస్ ఇస్తూ వచ్చిన టాస్కుల్లో కొత్త వాళ్ళైనా పోటుగాళ్లే పై చేయి సాధించారు. నాలుగు టాస్కుల్లో మూడు టాస్క్ లు పోటుగాళ్లు గెలిచారు.
వీరిలో ఎవరు స్మార్ట్ అని తెలుసుకోవడానికి ఒక ఫన్నీ టాస్క్ ఇచ్చాడు. టాస్క్ లో భాగంగా సినిమాల మీద వీళ్ళకి ఎంత అవగాహన ఉందో తెలుసుకోవడానికి కొన్ని ఫేమస్ డైలాగులు,పాటలు, పాపులర్ సీన్స్ కి సంబంధించిన ప్రశ్నలు అడిగారు బిగ్ బాస్. అఖండ సినిమాలో ని బాలయ్య బాబు డైలాగు తో మొదలు పెట్టారు. ఈ డైలాగులో బాలకృష్ణ చేతిలో ఉన్న ఆయుధం ఏంటి అని బిగ్ బాస్ అడిగారు. అమర్ టక్కున త్రిశూలం తీసుకెళ్లి బోర్డు పై పెట్టాడు. తర్వాత బాహుబలి లోని దేవసేన డైలాగ్ తేజ ని చెప్పమని అడిగాడు.
తేజా డైలాగ్ చెప్పి అందరిని నవ్వించాడు. తరువాత ఒక పాట ప్లే చేసి అందులో యాక్ట్రెస్ ఎవరు అని అడిగితే సందీప్ ఆన్సర్ చెప్పాడు. ఇక మహేష్ బాబు ఒక్కడు సినిమాలో ప్రకాష్ రాజ్ ని కొట్టిన ప్లేస్ ఏంటి అని అడగ్గానే ప్రశాంత్ ఆ ఫోటో తీసుకెళ్లి బోర్డు పై పెట్టాడు. ఈ పోటీ గౌతమ్ ,ప్రశాంత్ మధ్య జరిగింది. గౌతమ్ ,అమర్ దీప్ తో ఒక్కడు సీన్ రీక్రియేట్ చేయించాడు. మహేష్ ప్రకాష్ రాజ్ ని గుద్దినట్లు గౌతమ్ అమర్ ని గుద్దగా వెళ్లి తేజా మీద పడ్డాడు.
ఈ టాస్క్ కొంచెం ఫన్నీగా సాగింది. ఎవరు స్మార్ట్ టాస్క్ ఆటగాళ్లు తెలిచినా ఇంకా పోటుగాళ్లే లీడ్లో ఉన్నారు. వీళ్లు రెండు వాళ్ళు మూడు గెలిచినట్లు అవుతుంది. మరో చూడాలి రెండు జట్లలో ఎవరు నెక్స్ట్ కెప్టెన్ ఆఫ్ ది హౌస్ అవుతారో. అంబటి అర్జున్ ఇంప్రెస్ చేయడం స్టార్ట్ చేశాడు.
Bigg Boss’s ‘Who is the Smartest’ task is all about cinema knowledge. The Bigg Boss House is about to turn into a movie trivia battleground as contestants face off in the ‘Who is the Smartest’ task. #BiggBossTelugu7 @iamnagarjuna @DisneyPlusHSTel #StarMaa https://t.co/OYksKhT5DQ
— Starmaa (@StarMaa) October 12, 2023