Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతుంది. కాగా ఈ సీజన్ లో నాగార్జున హోస్టింగ్ అదరగొడుతున్నారు. వారం మొత్తం కంటెస్టెంట్స్ ఆడింది ఒక ఎత్తు .. వీకెండ్ లో నాగార్జున చేసే సందడి మరో ఎత్తు అనేటట్టుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కాగా వీకెండ్స్ లో నాగార్జున కాస్ట్యూమ్స్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ప్రతి వారం కొత్త టీ షర్ట్స్ తో దర్శనమిస్తున్నాడు. 64 ఏళ్లు పైబడినా కూడా యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గడం లేదు.
ఎలాంటి డిజైనర్ వేర్ వేసినా ఆయనకు సూట్ అయ్యే విధంగా ఉంటాయి. ఇక బిగ్ బాస్ షో లో ఆయన వేసే దుస్తులు ప్రత్యేకంగా ఉంటున్నాయి. నాగార్జున కోసం స్పెషల్ గా డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. కాగా శని, ఆది వారాల్లో నాగార్జున వేసుకునే కాస్ట్యూమ్స్ పై, వాటి ధర గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. ఆయన వేసుకొచ్చే రంగు రంగుల చొక్కాలు చూసి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.
ఆ షర్ట్స్ ఖరీదును గూగుల్ లో సెర్చ్ చేసి మరీ తెలుసుకుంటున్నారు. ఇక వాటి ధరను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. కాగా నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున వేసుకున్న ఎల్లో కలర్ టీ షర్ట్ అందర్నీ ఆకట్టుకుంది. అమర్ దీప్ కూడా టీ షర్ట్ చాలా బాగుంది .. నాకు ఇవ్వండి సార్ అంటూ అడిగాడు. కానీ నాగార్జున మాత్రం కూర్చో అంటూ చెప్పారు.
అమర్ దీప్ మనసు పడ్డ టీ షర్ట్ ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ ఎల్లో కలర్ టీ షర్ట్ ధర రూ. 211600 అట. ఇదే కాదు నాగార్జున వీకెండ్స్ లో వేసుకొస్తున్న.. షర్ట్స్ , టీ షర్ట్స్ ధరలు లక్షల్లో ఉంటాయట. కాగా నాగార్జున బిగ్ బాస్ కోసం వేసే కాస్ట్యూమ్స్ కి క్రేజ్ మామూలుగా ఉండటం లేదు. ఆ విషయం అటుంచితే ఈ ఆదివారం శోభ ఎలిమినేట్ అయ్యింది. అమర్, శివాజీ, ప్రశాంత్, అర్జున్, ప్రియాంక, యావర్ ఫైనల్ కి వెళ్లారు.