Bigg Boss 7 Telugu: 13వ వారం టాప్ ఓటింగ్ లో అనూహ్య ఫలితాలు… ఆ కంటెస్టెంట్ ఎలిమినేషన్ ఫిక్స్!

శివాజీ 26 శాతం ఓటింగ్ తో రెండవ స్థానంలో ఉన్నాడు. నిజానికి శివాజీ మొదటి స్థానంలో ఉండాల్సింది. కానీ .. గత రెండు మూడు వారాల నుంచి శివాజీ కాస్త నెగిటివ్ అయ్యాడు. దీంతో రెండవ స్థానానికి పడిపోయాడు.

Written By: NARESH, Updated On : November 28, 2023 6:22 pm

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 13వ వారం నిన్నటి నామినేషన్స్ హాట్ హాట్ గా జరిగాయి. హౌస్ లో ఉన్న ఎనిమిది మందిలో అమర్ దీప్ తప్ప మిగిలిన వాళ్ళందరూ నామినేట్ అయ్యారు. కాగా అర్జున్, గౌతమ్, శోభా శెట్టి, ప్రియాంక, పల్లవి ప్రశాంత్, శివాజీ, ప్రిన్స్ యావర్ నామినేషన్ లిస్ట్ లో ఉన్నారు. ఈ ఓటింగ్ ప్రక్రియ సోమవారం రాత్రి ప్రారంభం అయింది. ఇందులో రైతు బిడ్డ ప్రశాంత్ మొదటి స్థానంలో దూసుకుపోతున్నాడు. దాదాపు 28 శాతం ఓటింగ్ నమోదు చేసుకున్న ప్రశాంత్ టాప్ లో ఉన్నాడు.

ఇక శివాజీ 26 శాతం ఓటింగ్ తో రెండవ స్థానంలో ఉన్నాడు. నిజానికి శివాజీ మొదటి స్థానంలో ఉండాల్సింది. కానీ .. గత రెండు మూడు వారాల నుంచి శివాజీ కాస్త నెగిటివ్ అయ్యాడు. దీంతో రెండవ స్థానానికి పడిపోయాడు. గత నామినేషన్స్ లో ఈ లెక్క సరిజేసి మళ్ళీ పుంజుకుంటున్నాడు శివాజీ. ఇక ప్రిన్స్ యావర్ మూడవ స్థానంలో 16 శాతం ఓటింగ్ తో కొనసాగుతున్నాడు. అమర్ దీప్ నామినేషన్స్ లో లేకపోవడంతో శోభా శెట్టి కి బాగా ప్లస్ అయింది.

అమర్ ని కెప్టెన్ చేసేందుకు శోభా ఒక చిన్నపాటి యుద్ధమే చేసింది. ఇది ఆమెకు పాజిటివ్ గా మారిందని చెప్పవచ్చు. అమర్ నామినేషన్స్ లో లేడు కాబట్టి అతని ఫ్యాన్స్ శోభా కి ఓట్లు వేస్తున్నారు. దీంతో శోభ ఎప్పుడూ లేనిది 10 శాతం ఓటింగ్ నమోదు చేసుకుని ఐదవ స్థానంలో ఉంది. ప్రియాంక 8 శాతం ఓటింగ్ తో ఆరో స్థానంలో ఉంది. ఇక మిగిలిన అర్జున్, గౌతమ్ లు డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

గౌతమ్ 7 శాతం ఓటింగ్ తో ఏడవ స్థానంలో ఉండగా అర్జున్ అందరికంటే తక్కువ ఓటింగ్ తో చివరి స్థానానికి పడిపోయాడు. వాస్తవానికి అర్జున్ తన గొయ్యి తానే తవ్వుకున్నాడు అని చెప్పవచ్చు. ఎందుకంటే కెప్టెన్సీ విషయంలో శివాజీ అతని కోసం అంత స్టాండ్ తీసుకుంటే, తిరిగి శివాజీని నామినేట్ చేయడంతో ప్రేక్షకులు జీర్ణించుకోలేక పోయారు. ఇది అర్జున్ కి అతి పెద్ద మైనస్ అవుతుంది. ఈ కారణంగా అర్జున్ ఈ వారం ఎలిమినేట్ అయినా ఆశ్చర్యం లేదు.