Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 లో శివాజీ కి వచ్చినంత పాజిటివిటీ మరే కంటెస్టెంట్ కి రాలేదు. శివాజీ లేకపోతే ఈ సీజన్ లేదు అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఒక విధంగా అది కూడా నిజమే. అంతలా శివాజీ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. చివరకు ఫినాలే లో అడుగుపెట్టి .. టైటిల్ రేస్ లో కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఫినాలే వీక్ లో భాగంగా వరుసగా కంటెస్టెంట్స్ జర్నీ వీడియోలు చూపిస్తున్నారు బిగ్ బాస్.
కాగా నిన్న ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో శివాజీ జర్నీ వీడియో విడుదల చేశారు. ముందుగా శివాజీ మాట్లాడుతూ ‘ నా 25 ఏళ్ల ఇండస్ట్రీ కెరీర్ ఒక ఎత్తు .. ఈ బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ మరో ఎత్తు అంటూ శివాజీ చెప్పుకొచ్చారు. ఇక గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన ఫోటోలు చూసి ఆయన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు శివాజీ. ఇక బిగ్ బాస్ శివాజీ గురించి చెప్తూ .. మిమ్మల్ని ఒక వేలు ఎత్తి చూపిస్తే .. మిగతా నాలుగు వేళ్లు వాళ్ళ వైపే చూపించేట్టు చేయగలిగే మాటకారి మీరు.
మీ గాయం మిమ్మల్ని ఎంత భాదించినా ఓటమి వైపు చూడలేదు. మీ అబ్బాయే మీకు డాక్టర్ గా వచ్చినప్పుడు మీ బాధనంతా మర్చిపోయారు. సరైన సమయంలో సరైన పావులు కదుపుతూ చాణక్యుడిగా నిలిచారు. ఈ సీజన్ లో మీపై చేయి సాధించిన ఒకే ఒక విషయం ఏంటో తెలుసా .. కాఫీ పై మీ ఇష్టం. కంటెస్టెంట్ గా మొదలై .. కన్ఫర్మేషన్ పొంది .. హౌస్ మేట్ గా నిలిచారు.
మీ ఆట తీరే మిమల్ని ఈ రోజు ఈ స్థానంలో నిలబెట్టింది అంటూ బిగ్ బాస్ శివాజీని పొగిడేశారు. కాగా శివాజీ తీవ్ర భావోద్వేగానికి గురైయ్యాడు. కళ్ళలో నీళ్ళు పెట్టుకుని .. చూసే ఆడియన్స్ ని ఎమోషన్స్ తో పిండేశారు.
💭 Touching Moments Unveiled! Bigg Boss brings out the emotions in Sivaji by sharing a compilation of his best moments and journey within the house! #BiggBossTelugu7 #StarMaa @iamnagarjuna https://t.co/MvrnE0BxaM
— Starmaa (@StarMaa) December 12, 2023