Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ప్రేక్షకుల ఆదరణ బాగా పొందింది. గత సీజన్ తో పోలిస్తే సీజన్ 7 భారీ టీఆర్పీ తో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తుంది. ఇప్పటికే 14 వారాలు పూర్తి చేసుకుని ఫినాలే లో అడుగుపెట్టింది. ఇక మరో ఆరు రోజుల్లో బిగ్ బాస్ షో కి ఎండ్ కార్డు పడనుంది. కాగా వచ్చే ఆదివారం టైటిల్ ఎవరు కొడతారు అనే చర్చ జోరుగా నడుస్తుంది. టైటిల్ రేసు గత వారమే ప్రారంభమైంది. టైటిల్ కోసం ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి.
ప్రస్తుతం హౌస్ లో టాప్ 6 కంటెస్టెంట్స్ ఉన్నారు. శివాజీ, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, అంబటి అర్జున్, అమర్ దీప్, ప్రియాంక జైన్ ఫైనలిస్టులు గా నిలిచారు. అయితే విజేత ఎవరో తెలుసుకునేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. కాగా ఈసారి గత సీజన్స్ కంటే భిన్నంగా ఓటింగ్ ప్రక్రియ మార్చేశారు. గతంలో రోజుకు ఒక్కొక్కరు పది ఓట్లు వేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు రోజుకు కేవలం ఒక్క ఓటు మాత్రమే వేసే ఛాన్స్ ఉంది.
అయితే చాలా మంది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లో ఓట్ చేస్తుంటారు. అందులో ఒకే ఓటు ఉంటుంది. మరో వైపు మిస్డ్ కాల్ ఇచ్చి మరో ఓటు వేస్తారు. కాగా మిస్డ్ కాల్ ఒకేసారి రింగ్ అయి కట్ అవుతుంది. రెండోసారి చేస్తే కలవడం లేదు. ఈ నేపథ్యంలో కొందరు ఫ్రాడ్ జరుగుతుందని ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ కలవడం లేదు. వాళ్ళను విన్నర్ చేసేందుకు బిగ్ బాస్ టీం కావాలని చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ క్రమంలో స్టార్ మా పరోక్షంగా స్పష్టత ఇచ్చింది. స్టార్ మా తన సోషల్ మీడియా వేదికగా .. ప్రియమైన బిగ్ బాస్ అభిమానులారా, ఒక్క మిస్డ్ కాల్ మాత్రమే ఓటు గా పరిగణించబడుతుంది అని గుర్తు చేస్తున్నాం .. ఎక్కువ మిస్డ్ కాల్స్ లెక్కించబడవు . నిష్పక్షపాతంగా ఆడుదాం .. ఒక వ్యక్తికి ఒక్క ఓటు చాలు అంటూ నోట్ షేర్ చేసింది. ఇక టైటిల్ పోరు ప్రశాంత్, శివాజీ, అమర్ మధ్య అంటూ గట్టిగా వినిపిస్తుంది. అనధికారిక ఓటింగ్లో ప్రశాంత్ దూసుకుపోతున్నాడు.
🚨📱 Attention #BiggBossTelugu7 enthusiasts! 🚀 Only one missed call will be counted as a vote, multiple missed calls won't be counted!🗳️👁️🗨 Let's play fair and square – a single vote per person is all it takes! 🤝🔢 #BiggBossTelugu7 #StarMaa @iamnagarjuna @DisneyPlusHSTel pic.twitter.com/3lzSHQ1ZtF
— Starmaa (@StarMaa) December 11, 2023