https://oktelugu.com/

Bigg Boss 7 Telugu Shivaji: చిల్లరి వేషాలు వేస్తే తొక్క తీస్తా…. హౌస్ లోని కంటెస్టెంట్స్ కు శివాజీ సీరియస్ వార్నింగ్..

ఈ పని వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళు చచ్చారే నా చేతులో.. తీసిన వాడిని నేను ఏమీ అనను కానీ వెనక ఉన్న మాస్టర్ మైండ్ కు మాత్రం తోలు తీసేస్తా…అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు.

Written By:
  • Vadde
  • , Updated On : September 21, 2023 / 08:21 AM IST

    Bigg Boss 7 Telugu Shivaji

    Follow us on

    Bigg Boss 7 Telugu Shivaji: నిన్న ఎపిసోడ్లో అమర్ దీప్ ఎవరికీ తెలియకుండా శివాజీ దగ్గర నుంచి పవర్ అస్త్రాను దొంగలించాడు. అయితే అప్పటినుంచి శివాజీ హౌస్ లోని ప్రతి కంటెస్టెంట్లు చేస్తూ ఉన్నాడు. పల్లవి ప్రశాంత్ ఇందాక అమరదీప్ ఏదో లెటర్ వచ్చింది కదా ఒకసారి అతన్ని అడుగు తీసి ఉంటాడేమో అని హింట్ ఇచ్చిన శివాజీ అర్థం చేసుకో లేకపోయాడు. అయితే తాజాగా రాత్రి అందరూ పడుకున్న రూమ్ లోకి వచ్చి.. శివాజీ అన్న మాటలు కొత్త కాంట్రవర్సీకి తెరలేపాయి.

    ఈ పని వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళు చచ్చారే నా చేతులో.. తీసిన వాడిని నేను ఏమీ అనను కానీ వెనక ఉన్న మాస్టర్ మైండ్ కు మాత్రం తోలు తీసేస్తా…అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. అయితే శివాజీ మాట్లాడిన రూమ్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరైనా ప్రియాంకా జైన్..పక్కన వాళ్లకు కూడా చెప్పండి అని కూల్ గా సమాధానం ఇచ్చింది. చిల్లరేషాలు వేసే వాళ్ళకి తొక్క తీసేస్తా అని శివాజీ దానికి రిప్లై ఇచ్చాడు.

    దీంతో ప్రియాంక కాస్త గట్టిగానే రియాక్ట్ అయింది…ఇక్కడ చిల్లర వేషాలు ఎవరు వేయడం లేదు అని కాస్త స్ట్రాంగ్ గానే అంది. నీ గురించి నేను అనడం లేదమ్మా అని శివాజీ అన్నప్పటికీ ..అయినా నాకు నచ్చలేదు అంది. నేను తీసిన వాళ్ల గురించి చెప్పాను అని శివాజీ అనడంతో.. అయినా సరే నాకు అలా తొక్క తీస్తాను..తోలు తీస్తాను..అనే మాటలు నచ్చలేదు..అని ప్రియాంక తేల్చి చెప్పింది. అయినా సరే శివాజీ తన మాట తీరు అంతేనని.. నిజంగా తీసిన వాడిని ఏమీ అనమాను. కానీ వెనక ఉన్న ఓవరాక్షన్ మాత్రం పర్లేదు లేదని స్ట్రాంగ్ గా అన్నాడు.

    నెక్స్ట్ డే స్టార్ రూమ్ లో ప్రియాంకా…అమర్ దీప్ ..శివాజీ మాటల గురించి డిస్కషన్ పెట్టుకున్నారు. ఆయన మాట మీరు నాకు నచ్చలేదు అని ప్రియాంక అంది. అయితే అమర్ దీప్ మాత్రం జరిగింది మొత్తం నా ప్లాన్ ఆఫ్ యాక్షన్.. ఇంప్లిమెంటేషన్ కూడా నాదే.. దీనికి కర్త ,కర్మ ,క్రియ అన్ని నేనే…ఎంతసేపు మాట్లాడతాడో మాట్లాడమను..దీని కోసం తిరిగి నన్ను టార్గెట్ చేసిన నాకు వచ్చే నష్టం ఏమి లేదు…అని అన్నాడు. నేను దేనికైనా రెడీ… ఇఫ్ హీ వాంట్స్ టు బికమ్ ఏ హీరో…ఐ విల్ బికమ్ ఏ విలన్..అని అన్నాడు. మొత్తానికి ఈ పవర్ అస్త్ర మిస్టరీ బిగ్ బాస్ హౌస్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది.