https://oktelugu.com/

Bigg Boss 7 Telugu : ఓకే ప్లేట్లో భోజనం.. రతిక.. ప్రిన్స్ ఎమోషనల్ సీన్స్ కి మైండ్ బ్లాక్ అయినా బిగ్ బాస్ కంటెస్టెంట్స్

మొత్తానికి రతిక నిన్న ఎపిసోడ్ లో ప్రిన్స్ కు ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చినట్లు నేటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Written By: , Updated On : September 20, 2023 / 11:01 PM IST
rathika prince yawarmain-169521093

rathika prince yawarmain-169521093

Follow us on

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం రతిక, ప్రిన్స్ యావర్ మధ్య వ్యవహారం ముదిరి పాకాన పడుతుంది. కిచెన్ లో చపాతీలు చేస్తున్న యావర్…రతికను కూడా నీకు రోటి కావాలా అని అడిగాడు. ఇంతకుముందు ఎపిసోడ్లో రతిక చేసిన విషయం అతను పెద్దగా పట్టించుకోనట్లే ప్రవర్తించాడు. పాపం కిచెన్ లో ఉండి ఇదంతా చూస్తున్నా పల్లవి ప్రశాంత్.. మీ సరసాలు తగలెయ్య..అని అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

తిరిగి కట్ చేస్తే…యావర్ టేబుల్ దగ్గర ఫుడ్ తింటున్నప్పుడు రతిక మెళ్లిగా వచ్చి ఆతని పక్కన కూర్చుంది. వెంటనే ప్రిన్స్ తన ప్లేట్ లో నుంచి చపాతీ తుంచి ప్రేమగా రతిక కు తినిపించాడు. అంతేకాక మరేం పర్లేదు.. అన్నీ మర్చిపో..తిను అంటూ తినిపించాడు. తనకు స్త్రీలు అంటే గౌరవం ఉందని.. ఎప్పటికీ తప్పుగా ప్రవర్తించనని.. యావర్ చెబుతూ ఉంటే..రతిక హ్యాపీగా గా నవ్వడంతోపాటు తను నిన్న ఓటింగ్ విషయంలో ఎందుకు అలా చేసిందో ఎక్స్ప్లనేషన్ కూడా ఇవ్వబోయింది. అయితే యావర్ అదేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని లైట్గా తీసుకున్నాడు.

ఇది చూసిన దామిని,గౌతమ్, శుభ శ్రీ.. ముగ్గురు షాక్ అయ్యారు. హౌస్ లోపల ఉన్న వేలు ముగ్గురు ఏ ఇన్స్టెంట్ గురించి మాట్లాడుకుని తెగ నవ్వారు. గౌతమ్ అయితే..వీడు మళ్ళీ మాయలో పడుతున్నాడు ఇక వీడి పని అయిపోయింది అని అన్నాడు.శుభశ్రీ అయితే నిన్న ఓటింగ్ అంతా జరిగిన తర్వాత కూడానా…అంటే.. దానికి దావని మరి నిన్న నేను ఆపరిచితో అంత గొడవ ఎందుకు పడ్డట్టు అని క్వశ్చన్ చేసింది. ఇంకేముంది నువ్వు కూడా వెళ్లి తినిపించే సరిపోతుంది అని శుభశ్రీ ఫన్నీగా అంది.

అప్పుడే అక్కడికి వచ్చిన ప్రియాంక జైన్ తో కూడా వాళ్ళు ఈ ఫన్నీ ఇన్సిడెంట్ గురించి మాట్లాడారు. ఇంతలో దామిని వాళ్ళిద్దరూ ఒకే ప్లేట్లో మునక్కాడలు చీకి చీకి పెడుతున్నారు అనడంతో అందరూ గట్టిగా నవ్వారు. పాపం పల్లవి ప్రశాంత్ మాత్రం వాళ్ళిద్దరూ ఒకే ప్లేట్లో తినడం చూడలేక అటు ఇటు తిరుగుతూ పిచ్చివాడిలా నవ్వుకుంటూ ఉన్నాడు.

అయితే అంట్లు కడుగుతున్న తేజ మాత్రం రతికకు తన స్టైల్ కౌంటర్ ఇచ్చాడు. పొదుపు చేయడం రతిక ను చూసి నేర్చుకోవాలి. రోజు ఇలా ఇద్దరు ముగ్గురు ఒకే ప్లేట్లో తింటే ఎంత పొదుపు అవుతుందో అని సెటైర్లు వేశాడు. అంతటి తాగకుండా ఒరే ప్రశాంత రేపటి నుంచి మనిద్దరం ఒకే ప్లేట్లో తిందాం అని నవ్వుతూ అన్నాడు. మొత్తానికి రతిక నిన్న ఎపిసోడ్ లో ప్రిన్స్ కు ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చినట్లు నేటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Bigg Boss Telugu 7 promo 1 - Day 17 | Love Blooms In Bigg Boss House | Nagarjuna | Star Maa