Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ లో భాగంగా ఈ రోజు పల్లవి ప్రశాంత్ తండ్రి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే దాదాపు అందరి కుటుంబ సభ్యులు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా .. రతిక, పల్లవి ప్రశాంత్ ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లో కి రావాల్సి ఉంది. అయితే ఈ రోజు ఎపిసోడ్ లో ప్రశాంత్ తండ్రి హౌస్ లోకి అడుగుపెట్టాడు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. కాగా ప్రశాంత్ తండ్రి వాళ్ళ పొలంలో పండించిన బంతి పూలు తీసుకుని హౌస్ లో కి వచ్చాడు. బాపూ బంగారం అంటూ ప్రశాంత్ ని పిలిచాడు.
తండ్రి మాట విని ప్రశాంత్ పరుగున వచ్చి .. తండ్రి కాళ్ళ పై పడి తీవ్ర భావోద్వేగానికి గురైయ్యాడు. తండ్రిని గుండెలకు హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. రెండు నెలలు అయిపోయింది నిన్ను చూడక అంటూ ప్రశాంత్ తండ్రి భోరున ఏడ్చాడు. పల్లవి ప్రశాంత్ తన తండ్రి ఎత్తుకుని ‘ మా నాన్న బిగ్ బాస్ లోకి వచ్చాడు .. తగ్గేదే లే’ అంటూ మురిసి పోయాడు. ఇక ప్రశాంత్ తండ్రి అందరితో మాట్లాడు .. కొట్టుకోకండి.. కలిసి ఉండండి అని చెప్పారు.
ఆ తర్వాత శివాజీకి దండం పెట్టాడు. ఆయనతో మాట్లాడుతూ ‘ నా కోడుకుని .. నీ బిడ్డ లాగా చేసుకున్నావ్ అంటూ ధన్యవాదాలు చెప్పాడు. ఇక తండ్రి కి అన్నం తినిపించాడు ప్రశాంత్. మేము బ్రతికినా .. చచ్చినా వీడి కోసమే అంటూ ఎమోషనల్ అయ్యారు. తర్వాత ఆయన ప్రశాంత్ తో ‘ నీ టాలెంట్ బాగా ఉపయోగించుకో .. ఏం చెప్పినా ఏడవకు .. నువ్వేడిస్తే అమ్మ ఏడుస్తుంది అంటూ సలహాలు ఇచ్చారు
ఒక సామాన్యుడు బిగ్ బాస్ హౌస్లో దుమ్మురేపుతుండగా… అతడి తండ్రి షోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది నిజంగా ఊహించని పరిణామం. బిగ్ బాస్ హౌస్లో ఏదైనా సాధ్యమే అని చెప్పేందుకు నిదర్శనం. నేటితో ఫ్యామిలీ వీక్ ముగియనుంది. కొందరి కుటుంబ సభ్యులు రావాల్సి ఉంది. అలాగే నామినేషన్స్ లో 5 మంది ఉండగా ఓటింగ్ నేడు ముగుస్తుంది.