Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan- Prashant Kishore: పీకేతో జగన్‌కు చెండిదా.. అందుకే టార్గెట్‌ చేశారా.. అసలేం జరిగింది?

CM Jagan- Prashant Kishore: పీకేతో జగన్‌కు చెండిదా.. అందుకే టార్గెట్‌ చేశారా.. అసలేం జరిగింది?

CM Jagan- Prashant Kishore: ప్రశాంత్‌కిశోర్‌.. అలియాస్‌ పీకే.. ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందారు. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ వ్యూహకర్తగా పనిచేశారు. తర్వాత ఉత్తర భారతదేశంలోని అనేక పార్టీలకు వ్యూహార రచించి గెలుపుకు బాటలు వేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌తోపాటు, ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీకి వ్యూహకర్తగా ఉన్నారు. ఇప్పటికీ ఏపీలో వైసీపీకి స్ట్రాటజిస్టుగా పనిచేస్తున్నారు. తన ఐప్యాక్‌ టీంతో ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. వ్యూహాల్లో మార్పులు చేస్తున్నారు. ఇంతరవకు బాగానే ఉన్నా.. ఇటీవల పీకేతో జగన్‌రెడ్డికి చడినట్లు కనిపిస్తోంది.

అందుకు తిట్లుల పడుతున్నా..
జగన్‌రెడ్డి గెలుపు కోసం పని చేసినందుకు ఆంధ్రతోపాటు బయట నుంచి తనకు తిట్లు వస్తున్నాయని ప్రశాంత్‌ కిశోర్‌ వాపోయిన ఓ వీడియో ఇటీవల వైరల్‌ అయింది. అంతకు ముందు ప్రభుత్వాల పనికి మాలిన విధానాలు, రాష్ట్రాలను దివాలా తీసే పథకాల గురించి మాట్లాడుతూ ఏపీని ఉదాహరణగా చూపించారు. మొత్తం పంచి పెడుతూ పోతే ఏపీలా అయిపోతుందని చెప్పారు. ఇదే తరహాలో పీకే వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు పూర్తిగా జగన్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా ఉంటున్నాయి. జగన్‌ పాలన తీరుపై ఘోరమైన అభిప్రాయాన్ని బయట కూడా కలిగిస్తున్నాయి.

ఇప్పటికీ ఐప్యాక్‌ సేవలు..
ఇదిలా ఉండగా, పీకే కంపెనీ ఐ ప్యాక్‌ ఇప్పటికీ జగన్‌ కోసం పని చేస్తోంది. అయినా ఎందుకు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘ప్రశాంత్‌ కిషోర్‌.. మనల్ని గెలిపిస్తున్నారు’ అని ఎన్నికలకు ముందు పార్టీ క్యాడర్‌ కు పరిచయడం చేశారు జగన్‌మోహన్‌రెడ్డి. గెలిచిన తర్వాత కూడా ఆయనే గెలిపించారని చాలా గౌరవం ఇచ్చారు. ఆయన అడగాలే కానీ.. ఎంత కావాలంటే అంత ఇచ్చి మళ్లీ స్ట్రాటజిస్ట్‌గా పెట్టుకుంటారు. కానీ ఆయన దూరంగా ఉండి.. ఆయన కంపెనీతో మాత్రం పనులు చేయించుకుంటున్నారు. అందు కోసం పెద్దమొత్తమే ముట్టజెప్పుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. పీకే బీహార్‌ లో పాదయాత్ర చేయడానికి కూడా జగన్‌ ఆర్థిక సాయం చేశారని చెబుతున్నారు.
పేట్‌ ఫిరాయింపుకు కారణం?
ఇంత చేసినా పీకే హఠాత్తుగా ప్లేట్‌ ఫిరాయించి జగన్‌కు మైనస్‌ అయ్యేలా ప్రకటనలు చేస్తున్నారు. ప్రశాంత్‌ కిశోర్‌ సంస్థ ఐ ప్యాక్‌ పనితీరు విషయంలో జగన్‌రెడ్డి పూర్తి అసంతృప్తిగా ఉన్నారని ఇటీవలి కాలంలో ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే పీకే.., జగన్‌కు హెచ్చరికలు పంపుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఐ ప్యాక్‌ కు ఏపీ తప్ప మరో రాష్ట్రం లేదు. కేసీఆర్‌ కూడా తన ఒప్పందాన్ని క్యాన్సిల్‌ చేసుకున్నారు. సోషల్‌ మీడియా స్ట్రాటజీలు మాత్రమే ఐ ప్యాక్‌ ఇస్తోంది. ఏపీలోనూ పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ ఫలితం తేడా వస్తే ఐప్యాక్‌ను హైర్‌ చేసుకునేందుకు మరో పార్టీ ముందుకు రాదు. మరోవైపు ఇప్పుడంతా సునీల్‌ కనుగోలు హవా నడుస్తోంది. ఈ పరిణామాలు అన్నింటినీ ఊహించే ప్రశాంత్‌కిశోర్‌ ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని భావిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular