Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నాలుగో వారం చాలా ఆసక్తికరంగా సాగుతుంది . ఈ వారం పవర్ అస్త్ర కోసం జరుగుతున్న పోటీలు చిత్ర విచిత్రంగా కొనసాగుతున్నాయి . పాపం కంటెస్టెంట్స్ పవర్ అస్త్ర పొందడానికి పడరాని పాట్లు పడుతున్నారు .ఇంటి సభ్యులందరూ బ్యాంకర్స్ టాస్క్ లో శక్తికి మించి కష్టపడి ఆడారు . టాస్క్ ముగిసే సమయానికి ప్రిన్స్ యావర్ ,పల్లవి ప్రశాంత్ దగ్గర ఎక్కువ బీబీ కాయిన్స్ ఉండటం తో వీరిద్దరూ పవర్ అస్త్ర టాస్క్ ఆడటానికి కంటెండర్స్ గా నిలిచిన విషయం తెలిసిందే .
ఇక మూడో కంటెండెర్ని ఎంపిక చెయ్యాలని బిగ్ బాస్ ఒక విచిత్రమైన టాస్క్ ఇచ్చాడు . కంటెస్టెంట్స్ అందరూ క్రియేటివ్ గా ఆలోచించి వారికి నచ్చిన విధంగా రెడీ అయ్యి ,అందరికి నవ్వు తెప్పించేలా ,విచిత్రంగా వేషం ఉండాలని చెప్పి ,ఎవరు ఎక్కువ నవిస్తారో ఈ పోటీలో విజేతలుగా నిలుస్తారని బిగ్ బాస్ అనౌన్స్ చెయ్యగానే , వారిలో వున్న క్రియేటివిటీ మొత్తం బయటకు తీసి వింతవింతగా రెడీ అయ్యారు కంటెస్టెంట్స్ .
గాలా ఈవెంట్ హోస్ట్స్ గా శోభా శెట్టి ,ఆట సందీప్ వ్యవహరించారు . గెస్ట్ గా శివాజీ ఉన్నాడు . కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిగా వచ్చి తమదైన శైలిలో అలరించారు . ఎంటర్టైన్మెంట్ విషయంలో తగ్గేదేలే అన్న రేంజిలో ఊపు ఊపేసారు . అమరదీప్ టాస్క్ ని చాలా సీరియస్ గా తీసుకున్నాడు . ఈ సారి అలాగైనా పవర్ అస్త్ర సాధించి హౌసెమట అవ్వాలని ఫిక్స్ అయ్యాడు . శోభా తో మాట్లాడుతూ ఈ టాస్క్ కోసం నేను ఏమైనా చేసేస్తారా సగం మీసం ,సగం గడ్డం కాదు ,అవసరమైతే సగం గుండు చేసుకుంటానికి కూడా రెడీ అంటాడు అమర్ .టాస్క్ కోసం మీసం ,గడ్డం సగం తీసేసి ,సగం అమ్మాయి ,సగం అబ్బాయిగా వేషం వేసాడు .
ఇది ఇలా ఉండగా గాలా ఈవెంట్ లో బెస్ట్ గా ఎవరు ఎంటర్టైన్ చేశారు అని బిగ్ బాస్ అడగగా శుభ శ్రీ పేరు చెప్పారు శోభా ,శివాజీ ,సందీప్ . దీంతో తనని ఎందుకు సెలెక్ట్ చెయ్యలేదు ,ఎంటర్టైన్మెంట్ నేనేం తక్కువ చేశాను అని మండిపడ్డాడు వారిపై పెద్ద పెద్దగా అరుస్తూ గోల చేశాడు అమరదీప్ . అసలే పోయిన వారం గుండు గీయించుకోడానికి నిరాకరించి అవకాశం పోగొట్టుకున్నాడు . ఈసారెమో త్యాగానికి ఫలితం లేకుండా పోయింది .