https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: అమర్ తాపత్రయం.. శివాజీ-అర్జున్ రాజకీయం.. కెప్టెన్సీ రద్దుచేసి షాకిచ్చిన బిగ్ బాస్

టాస్క్ లో ఓడిపోవడంతో తీవ్ర భావోద్వేగానికి గురైయ్యాడు. దీంతో ఈ వారం కెప్టెన్ అవ్వాలని చాలా బలంగా ఫిక్స్ అయ్యాడు అమర్ దీప్. కానీ ఆశలు గల్లంతయ్యాయి

Written By:
  • NARESH
  • , Updated On : November 25, 2023 / 09:16 AM IST

    Bigg Boss 7 Telugu

    Follow us on

    Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఇదే ఆఖరి కెప్టెన్సీ టాస్క్ దీంతో ఎలాగైనా అమర్ ని కెప్టెన్ చేసేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తుంది శోభా శెట్టి. అమర్ దీప్ కూడా ఉన్నది చివరి అవకాశం కావడంతో కెప్టెన్సీ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. గత వారం కూడా అమర్ చివరి వరకు వచ్చి ఓడిపోయాడు. టాస్క్ లో ఓడిపోవడంతో తీవ్ర భావోద్వేగానికి గురైయ్యాడు. దీంతో ఈ వారం కెప్టెన్ అవ్వాలని చాలా బలంగా ఫిక్స్ అయ్యాడు అమర్ దీప్. కానీ ఆశలు గల్లంతయ్యాయి .. వద్దని వేడుకుంటున్నా సరే శివాజీ కఠినంగా ప్రవర్తించాడు.

    ముందుగా శోభా .. అశ్విని తో ‘ ఆ ప్లేస్ లో అమర్ తప్ప వేరే ఎవరున్నా నీకే సపోర్ట్ చేసే దాన్ని అని చెప్పుకొచ్చింది. కాగా గతంలో శోభా ని ..అమర్ కెప్టెన్ ని చేశాడు. కాబట్టి ఎలాగైనా అమర్ ని ఈ వారం కెప్టెన్ చెయ్యాలని శోభా అందరిని అమర్ సపోర్ట్ చేయాలని కోరింది. ఈ క్రమంలోనే అమర్ తో శివన్న నిన్ను తీయడు గా అని అడిగింది. ‘ అసలు ఛాన్స్ లేదు శివన్న నాకే సపోర్ట్ చేస్తారు అని చెప్పాడు అమర్.

    అయితే యావర్ ని పక్కకి తీసుకెళ్లి అమర్ – అర్జున్ ఇద్దరూ వస్తేనే నాకు టెన్షన్ .. ఎందుకంటే అర్జున్ భార్య ప్రెగ్నెంట్ కదా నన్ను అడిగింది తను ఇంకోసారి కెప్టెన్ అయితే చూడాలని అంటూ కొత్త పాయింట్ చెప్పాడు. ఇక చివరికి అర్జున్ -అమర్ ఫోటోలు వచ్చాయి. ఇక నిర్ణయం శోభా -శివాజీ చేతుల్లో ఉంది. శోభ అమర్ కి మద్దతు తెలిపింది. కానీ శివాజీ మాత్రం అర్జున్ కి ఒక కోరిక ఉందంటూ మొదలు పెట్టాడు.

    అర్థం చేసుకో అన్నా .. ప్లీజ్ ఇప్పుడు అవకాశం వచ్చింది పోగొట్టకు అన్నా .. నీకు దండం పెడతా అంటూ శివాజీ ని వేడుకున్నాడు అమర్. అయితే ఏం చేయమంటావు రా .. ఏడుస్తావు ఎందుకు .. రేపు టికెట్ టు ఫినాలే ఉంది.. దమ్ముంటే ఆడి గెలువు అంటూ అరిచాడు. నేను కెప్టెన్ అవ్వాలన్న అంటూ ఏడుస్తూ గట్టిగా అరిచాడు. దీంతో ‘ నా కంటే హైట్ ఉండి .. బలంగా కండలు ఉండి .. బాడీ ఉంటే వాళ్ళే గొప్ప అంటూ లోపలికి వెళ్లి ఏడ్చేశాడు అమర్.

    అర్జున్-అమర్ లలో ఎవరిని ఉంచాలి, ఎవరిని తప్పించాలనే చర్చ చాలా సేపు నడిచింది. దీంతో బిగ్ బాస్ విసిగిపోయాడు. ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా కెప్టెన్సీ టాస్క్ రద్దు చేస్తున్నానని ప్రకటించాడు. అర్జున్-శివాజీ రాజకీయం, శోభ పట్టుదల వెరసి ఈ వారం కెప్టెన్సీ టాస్క్ రద్దు అయ్యింది.