https://oktelugu.com/

Ambati Rayudu: అంబటి రాయుడు అక్కడ పాగా వేస్తున్నాడే

2014 ఎన్నికల్లో వైసీపీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ విజయమ్మ విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. కానీ ఘోర ఓటమి చవిచూశారు. 2019 ఎన్నికల్లో ఎంవివి సత్యనారాయణ ఎంపీగా అనూహ్య విజయం దక్కించుకున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 14, 2023 3:36 pm
    Ambati-Rayudu
    Follow us on

    Ambati Rayudu: యంగ్ క్రికెటర్ అంబటి రాయుడు పొలిటికల్ ఎంట్రీ కి సిద్ధపడుతున్నారు. ఇప్పటికే ఆయన వైసీపీకి సన్నిహితంగా ఉన్నారు. పలుమార్లు సీఎం జగన్ ను కలవడమే కాదు… వైసీపీ నేతలతో చట్టపట్టాలు వేసుకుని మరీ తిరుగుతున్నారు. స్వస్థలం గుంటూరు కావడంతో.. ఎంపీగానో, ఎమ్మెల్యే గానో పోటీ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కొద్దిరోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి పరిస్థితిని కూడా తెలుసుకున్నారు. ఇంతలో కొద్ది రోజులు పాటు తెర మరుగయ్యారు. ఇప్పుడు మళ్లీ రాజకీయ ఆసక్తి కనబరుస్తున్నారు.

    మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అంబటి రాయుడు విశాఖ పార్లమెంట్ స్థానంపై ఫోకస్ పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆయన విశాఖ వెళ్లి నేరుగా ఆ జిల్లాకు చెందిన మంత్రి అమర్నాథ్ చర్చలు జరపడం మరింత అనుమానాలను పెంచుతోంది. ప్రస్తుతం విశాఖ సిట్టింగ్ ఎంపీ సత్యనారాయణ.. విశాఖ తూర్పు అసెంబ్లీ స్థానానికి వైసీపీ ఇన్చార్జిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో వైసిపి బలమైన అభ్యర్థిని విశాఖ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయించాలని చూస్తోంది. మొన్నటి వరకు వై వి సుబ్బారెడ్డి పేరు వినిపించినా.. ఆయన ఒంగోలు సీటుపై మక్కువ పెంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఒక సెలబ్రిటీ ని రంగంలోకి దిస్తే ఫలితం ఉంటుందని హైకమాండ్కు నివేదికలు అందినట్లు తెలుస్తోంది.

    2014 ఎన్నికల్లో వైసీపీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ విజయమ్మ విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. కానీ ఘోర ఓటమి చవిచూశారు. 2019 ఎన్నికల్లో ఎంవివి సత్యనారాయణ ఎంపీగా అనూహ్య విజయం దక్కించుకున్నారు. అయితే ఈసారి ఎన్నికలు అంత ఆషామాషీగా జరిగే అవకాశం లేదు. పైగా విశాఖ రాజధాని అంశంతో వైసిపి ముందుకెళ్తోంది. విశాఖ పార్లమెంట్ స్థానంతో పాటు నగరంలోని అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. గత ఎన్నికలు ఒక ఎత్తు. ఎన్నికలు మరో ఎత్తు. గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడం ద్వారానే వైసీపీ విజయం సాధ్యమైంది. ఇప్పుడు ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తుండడంతో వైసిపి ఎదురీదక తప్పదు. అందుకే ఒక సెలబ్రిటీని రంగంలోకి దించితే ఫలితం ఉంటుందన్న వాదన ఉంది. ఈ తరుణంలోనే యంగ్ క్రికెటర్ గా జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన అంబటి రాయుడు దృష్టి పెట్టినట్లు సమాచారం. హై కమాండ్ ఆదేశాలు లేనిది ఆయన విశాఖ పర్యటనకు రారని.. ముమ్మాటికి ఆయన విశాఖ నుంచి పోటీ చేయడం ఖాయమని వైసిపి వర్గాలు చెబుతున్నాయి.

    విశాఖలో ఉత్తరాధి రాష్ట్రాల వారు అధికం. వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, శాఖలకు సంబంధించి కీలక కార్యాలయాలు విశాఖలో ఉన్నాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఉత్తరాధి రాష్ట్ర ప్రజలు విశాఖలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారు. గతంలో బిజెపి ఇక్కడ గెలవడానికి ఉత్తరాధి రాష్ట్రాల వారే కారణం. అందుకే అందరికీ సుపరిచితుడైన, యంగ్ క్రికెటర్ గా పేరు తెచ్చుకున్న అంబటి రాయుడును బరిలో దించితే.. ఉత్తరాధి రాష్ట్ర ఓటర్లను ఆకట్టుకోవచ్చని వైసీపీ హై కమాండ్ భావిస్తోంది. అందుకే రాయుడిని విశాఖకు పంపించింది.అందులో భాగంగానే రాయుడు విశాఖలో ప్రత్యక్షమయ్యారు. అక్కడ రాజకీయ పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎన్నికల సమయంలో వైసీపీ హై కమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.