Bigg Boss 7 Telugu
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్, రన్నర్ అప్ ఎవరు కాబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. కాగా గ్రాండ్ ఫినాలే షూట్ కూడా పూర్తి అయినట్లు సమాచారం. ప్రస్తుతం హౌస్ లో ఉన్న టాప్ 6 కంటెస్టెంట్స్ ఫైనలిస్టులుగా ఫిక్స్ అయిపోయారు. వీళ్ళు నేరుగా గ్రాండ్ ఫినాలే లో అడుగు పెడతారు. వారిలో చివరి ముగ్గురి ఎలిమినేషన్ షూటింగ్ శనివారమే జరగనుంది. ఇక టాప్ 3 కంటెస్టెంట్స్ లో విన్నర్, రన్నర్ ను మాత్రం ఆదివారం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో ప్రకటిస్తారు.
కాగా మాజీ కంటెస్టెంట్స్ ఫినాలే స్టేజి పై ఆటపాటలతో అలరించబోతున్నారు. అయితే శుక్రవారం దీనికి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయింది. ఇక విన్నర్ కి ట్రోఫీ అందజేసేందుకు హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు వస్తున్నట్లు న్యూస్ లీకైంది. ఇక అతనితో పాటు చాలా మంది సెలెబ్రేటిస్ సందడి చేయబోతున్నారు. అయితే టైటిల్ బరిలో నిలిచిన ఆరుగురు కంటెస్టెంట్స్ కోసం ఓటింగ్ భారీగా నమోదయింది.
కానీ వారిలో శివాజీ, పల్లవి ప్రశాంత్ కి అత్యధికంగా ఓట్లు పోల్ అయ్యాయి. ఇక ఇద్దరిలో విన్నర్, రన్నర్ అప్ గురించి ఒక లీక్ బయటకు వచ్చింది. ఫినాలే కి ఇంకా సమయం ఉంది .. షూటింగ్ కూడా పూర్తి కాలేదు. అయినప్పటికీ వికీపీడియా లో సీజన్ 7 విన్నర్, రన్నర్ ఎవరో లీక్ అయిపోయింది. ఈ సమాచారం ప్రకారం పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలుస్తాడట. ఇక శివాజీ రన్నర్ అని తెలిసింది.
వికీపీడియాలో ముందే ఈ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడంతో పెద్ద సెన్సేషన్ గా మారింది. అయితే ఇప్పుడు దాన్ని డిలీట్ చేసేసారు. అయినప్పటికీ దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ బయటకు వచ్చాయి. దీంతో ప్రశాంత్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. వీటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.