https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: అర్జున్ బిగ్ బాస్ కి గోడ మీద పిల్లి లాంటి వాడా?

అర్జున్ టాప్ 5లో ఉంటారు.. లేదంటే విన్నర్ అవుతారని ఎన్నో ఆర్టికల్స్ వచ్చాయి.. ఆయన అభిమానులు బల్ల గుద్ది మరీ చెప్పారు. కానీ సడన్ గా ఈ మధ్య నెగిటివ్ ఎక్కువగా రావడంతో అసలు ఇంట్లో ఉంటాడా అనే అనుమానం కూడా వస్తుంది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 18, 2023 / 12:43 PM IST

    Bigg Boss 7 Telug

    Follow us on

    Bigg Boss 7 Telugu: అంబటి అర్జున్ ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. సీరియల్స్ ద్వారా అభిమానులను సంపాదించిన ఈ నటుడు బిగ్ బాస్ ద్వారా చాలా ఫేమస్ అయ్యారు. అయితే ఈ కంటెస్టెంట్ టాప్ 5లో ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ కాస్త నెగిటివిటీ కూడా ఈ మధ్య రావడంతో అసలు అర్జున్ ఉంటారా లేదా అనుమానం కూడా వస్తుందట. ఇంతకీ అర్జున్ ఎక్కడ ఆట విషయంలో తప్పటడుగులు వేస్తున్నారు? ఎందుకు నెగిటివ్ ప్రచారం జరుగుతుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

    అర్జున్ టాప్ 5లో ఉంటారు.. లేదంటే విన్నర్ అవుతారని ఎన్నో ఆర్టికల్స్ వచ్చాయి.. ఆయన అభిమానులు బల్ల గుద్ది మరీ చెప్పారు. కానీ సడన్ గా ఈ మధ్య నెగిటివ్ ఎక్కువగా రావడంతో అసలు ఇంట్లో ఉంటాడా అనే అనుమానం కూడా వస్తుంది.. అయితే రియాలిటీ ఎప్పటికైనా బయట పడక తప్పదు. ప్రస్తుతం ఆట విషయంలో అర్జున్ పూర్తిగా ఓపెన్ అయ్యారు. ఆట ఎలా జరుగుతుంది? ఎవరి ప్రవర్తన ఎలా ఉంది? దాని ద్వారా ఎవరికి ఎక్కువగా జనాల్లో మంచి మార్కులు పడుతున్నాయి? అనే విషయాలను పూర్తిగా క్లారిటీగా తెలుసుకొని మరీ వైల్డ్ కార్డ్ ద్వారా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు అంబటి.

    బిగ్ బాస్ గురించి, అందులో ఉంటున్న కంటెస్టెంట్స్ గురించి కూడా పూర్తిగా తెలుసుకున్న అంబటి మొదట్లో తెలివిగా, హుందాగా ప్రవర్తించారు. అంతేకాదు ఏ గ్రూప్ లోనూ జత కట్టకుండా తాను ఒంటరి అని నిరూపించుకునే ప్రయత్నం కూడా చేశారు. పైగా సీరియల్ బ్యాచ్ కు వీలైనంత దూరంగా ఉన్నాడు. అందుకే ఈయన బాగా ఆడుతున్నారు అని మొదట్లో ఎక్కువగా నమ్మారు ప్రేక్షకులు.

    కానీ నిన్నటి ఆట తర్వాత కచ్చితంగా ఒక ఎనాలసిస్ చేస్తే ప్రియాంక ఎడిషన్ పాస్ పొందడానికి కావలసిన సర్వ ప్రయత్నాలు అమర్దీప్, అర్జున్ గౌతమ్ తో సహా చేసినట్టుగా అనిపించింది. ఎందుకు ప్రియాంకకు అర్జున్ సపోర్ట్ చేశారు అంటే ఆమె కనక ఎడిషన్ పాస్ తీసుకుంటే రేపటి రోజు శివాజీ బ్యాచ్ లో ఎవరైనా ఒకవైపు ఉండి తను మరోవైపు ఉంటే తనను పక్కాగా ప్రియాంక సేవ్ చేస్తుందనే నమ్మకం అతనికి కలిగినట్టుందట. అందుకే ప్రియాంకను కాపాడడానికి శోభకి హింట్స్ ఇస్తూ వచ్చాడు. దాంతో తను సీరియల్ బ్యాచ్ కి సపోర్ట్ చేస్తున్న విషయం అందరికీ అర్థమైపోయింది. మరి ఇదే విధంగా అర్జున్ ఆటను కంటిన్యూ చేస్తే ఏదో ఒక రోజు ఎలిమినేట్ అవడం పక్కా అంటున్నారు బిగ్ బాస్ లవర్స్.