Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ 7 టికెట్ టూ ఫినాలే రేస్ ఆసక్తికరంగా సాగింది. ఎన్నో ట్విస్టులు తో సాగిన ఫైనల్ అస్త్ర అర్జున్ విజయం సాధించాడు. అయినప్పటికీ అమర్ అత్యధిక పాయింట్లు సాధిస్తూ రేస్ లో మొదటి నుంచి టాప్ లో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే అమర్ దీప్ ఓ సంచలన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఫినాలే రేస్ ఎనిమిది మందితో మొదలైంది. పాయింట్స్ పట్టికలో తక్కువ స్కోర్ ఉన్న కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా రేస్ నుంచి తప్పుకున్నారు.
ఇక శోభా, శివాజీ తమ పాయింట్లు అమర్ కి ఇచ్చారు. తర్వాత గౌతమ్ కూడా రేస్ నుంచి తప్పుకుంటూ .. అమర్ కి పాయింట్లు ఇచ్చాడు. దీనికి తోడు అమర్ కూడా కొన్ని టాస్కుల్లో గెలవడంతో 1200 పాయింట్స్ తో అర్జున్ కంటే అతడే టాప్ లో నిలిచాడు. అయితే చివరి టాస్క్ లలో పుంజుకున్న అర్జున్ అత్యధిక పాయింట్స్ తో విన్నర్ అయ్యాడు. కాగా వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున అమర్ పై ప్రశంసలు కురిపించారు. టాస్కులు ఆడడంతో పాటు ఎలాగోలా పాయింట్లు సాధించి టాప్ ప్లేస్ లో నిలిచావు అన్నాడు.
అమర్ ని కాసేపు ఆటపట్టించిన నాగార్జున తర్వాత అమర్ ఆట తీరును బాగా మెచ్చుకున్నారు. అయితే అమర్ దీప్ ఒక్క కోరిక ఉంది సార్ మీరు తీర్చాలి. నన్ను ఒక్కసారి కెప్టెన్ అమర్ దీప్ అని పిలవండి సార్ హ్యాపీ గా ఫీల్ అవుతాను అన్నాడు. దీంతో నాగార్జున ‘నీ కోసం .. నీ హార్ట్ లో ఉన్న ఆ తీరని కోరిక’ కోసం .. నీకు వచ్చిన 1200 పాయింట్లు కోసం నువ్వు వచ్చే వారం కెప్టెన్’ అన్నారు.
కానీ నీకు ఇమ్యూనిటీ లభించదు అని ఆఫర్ ఇచ్చాడు. దీంతో బిగ్ బాస్ షో చరిత్రలో సరికొత్త రికార్డు నమోదయింది. ఎందుకంటే ఇంత వరకు తెలుగుతో పాటు ఏ లాంగ్వేజ్ బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ కూడా స్పెషల్ కెప్టెన్ అవ్వలేదు. అంటే ఇమ్యూనిటీ లేకుండా కెప్టెన్ గా నిలవలేదు. అందులోనూ హోస్ట్ ద్వారా ఎంపిక అవలేదు. దీంతో అమర్ రికార్డు సృష్టించాడు. ఫినాలే అస్త్ర కోసం అతడు పడిన కష్టానికి ప్రతిఫలంగా నాగార్జున కెప్టెన్ చేసి కోరిక తీర్చాడు.