Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ 6 చివరి దశకి చేరుకుంది..ఇందులో భాగంగా నిన్న ‘టికెట్ 2 ఫినాలే’ టాస్కు ని నిర్వహించాడు బిగ్ బాస్..ఈ టాస్కులో గెలుపొందిన కంటెస్టెంట్ నేరుగా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కి వెళ్ళిపోతారు..ఈ టాస్కులో నిన్న హౌస్ లో ఉన్న ఇనాయ, శ్రీ సత్య మరియు కీర్తి వైదొలిగారు..ఒక్క ఫైమా మినహా ఈ టాస్కులో కంటెస్టెంట్స్ కేవలం మగవాళ్ళు మాత్రమే మిగిలారు..ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో బిగ్ బాస్ పై కాస్త నెగటివిటీ పెంచింది.

ఈ సీజన్ ప్రారంభం నుండి టాస్కులన్నీ మగవాళ్లకు అనుకూలంగా ఉండేవే ఇస్తున్నారని..ఫిజికల్ టాస్కులలో ఆడవాళ్ళూ అన్యాయం అయిపోతున్నారని కామెంట్స్ చేస్తున్నారు..హౌస్ లో మగ కంటెస్టెంట్స్ అందరూ ఫిజికల్ గా చాలా దృఢమైన వారని..అలాంటి వారితో ఆడవాళ్లు తలపడడం సాధ్యపడదని..కానీ హౌస్ లో ఉన్న లేడీస్ అందరూ ఎన్నో టాస్కులలో మగవాళ్ళతో సరిసమానంగా ఆడారని సోషల్ మీడియా లో నెటిజెన్స్ చెప్పుకుంటున్నారు.
అయితే ప్రారంభం లో బిగ్ బాస్ ఫిజికల్ టాస్కులకంటే ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ టాస్కులే ఇచ్చాడు..కానీ హౌస్ మేట్స్ వాటిల్లో రాణించకపోవడం వల్ల టీఆర్ఫీ రేటింగ్స్ అతి దారుణంగా పడిపోయాయి..ఇక అప్పటి నుండి బిగ్ బాస్ ఫిజికల్ టాస్కులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడని..బిగ్ బాస్ ఇచ్చిన అద్భుతమైన అవకాశం ని కంటెస్టెంట్స్ మొదట్లో ఉపయోగించుకోలేదని..ఇప్పుడు బిగ్ బాస్ మీద ఎన్ని మాట్లాడి ఏమి ప్రయోజనం అంటూ రివ్యూయర్స్ అంటున్నారు.

ఇప్పటి వరుకు టెలివిజన్ లో ప్రసారమైన 5 సీజన్స్ లో లేడీ కంటెస్టెంట్స్ టైటిల్ కొట్టిన దాఖలాలు లేవు..కానీ బిగ్ బాస్ OTT వెర్షన్ లో మాత్రం బిందు మాధవి టైటిల్ కొట్టింది..ఈ సీజన్ 6 లో ఇనాయ సుల్తానా కి టైటిల్ ని కొట్టే అవకాశాలు రేవంత్ తో పాటు సమానంగా ఉంది..మరి ఆమె టైటిల్ గెలుచుకొని బిగ్ బాస్ టెలివిజన్ హిస్టరీ లో మొదటి లేడీ విన్నర్ గా నిలుస్తుందో లేదో చూడాలి.