Kriti Sanon- Prabhas: రెండు రోజులుగా ప్రభాస్ పెళ్లి వార్త పరిశ్రమను ఊపేస్తోంది. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ని ప్రభాస్ వివాహం చేసుకోబుతున్నాడంటూ వరుస కథనాలు వెలువడ్డాయి. ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు అయితే ఒక అడుగు ముందుకేసి, ఎంగేజ్మెంట్ కూడా అంటూ ట్వీట్ చేశారు. ఆదిపురుష్ మూవీ సెట్స్ లో ప్రభాస్ హీరోయిన్ కృతి సనన్ ప్రేమలో పడిపోయాడు. వెంటనే ఆమెకు ఐ లవ్ యు చెప్పాడు. ప్రభాస్ అంటే కృతికి కూడా ఇష్టం కాగా… ఓకే చెప్పేసింది. ఈ జంట త్వరలో ఎంగేజ్మెంట్ జరుపుకోబోతున్నారని, ఉమర్ సంధు తన ట్వీట్ లో పేర్కొన్నారు.

దానికి ముందు జరిగిన రెండు పరిణామాలు ఈ ఊహాగానాలకు బలం చేకూర్చాయి. ఓ ఇంటర్వ్యూలో కృతి సనన్ క్రేజీ కామెంట్స్ చేసింది. ప్రభాస్ అంటే నాకు ఇష్టం. ఆయన ఓకే అంటే పెళ్ళికి రెడీ అని చెప్పింది. ఆమె అంత ఓపెన్ కావడం పలు అనుమానాలు రేకెత్తించింది. ఇక వరుణ్ ధావన్ చేసిన కామెంట్ అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది. కృతి సనన్ ని ప్రేమిస్తున్న వ్యక్తి ముంబైలో లేడు. వేరే చోట దీపికా పదుకొనెతో షూటింగ్ చేస్తున్నాడంటూ… ఒక రియాలిటీ షోలో చెప్పడం జరిగింది.
ఇవన్నీ సంగ్రహించి పరిశీలిస్తే ప్రభాస్-కృతి సనన్ మధ్య ప్రేమ నిజమే కావచ్చన్న భావన అందరిలో కలిగింది. కాగా ఎట్టకేలకు ఈ రూమర్స్ పై కృతి సనన్ ఓపెన్ అయ్యారు. ఆమె సోషల్ మీడియా పోస్ట్ ద్వారా స్పష్టత ఇచ్చారు. నేను ఎవరితో ప్రేమలో పడలేదు. వరుణ్ ధావన్ రియాలిటీ షోలో చిన్న ఫన్ చేశాడు. అంతకు మించి ఏమీ లేదు. నేను మౌనంగా ఉంటే పెళ్లి డేట్ కూడా ప్రకటించేసేలా ఉన్నారు. అందుకే నేను దీనిపై క్లారిటీ ఇస్తున్నానంటూ కామెంట్ పోస్ట్ చేశారు.

ఈ న్యూస్ ప్రభాస్ అభిమానులను ఆనందంలో ముంచేసింది. ఒక బాలీవుడ్ హీరోయిన్ మెడలో ఆయన తాళి కట్టడం అభిమానులు అంతగా ఇష్టపడటం లేదు. దీనికి వారి సోషల్ మీడియా కామెంట్స్ నిదర్శనం. హీరోయిన్ కాకుండా సంప్రదాయబద్ధమైన తెలుగింటి ఆడపిల్ల మాకు వదినగా కావాలని కోరుకుంటున్నారు. కృతి సనన్ ప్రభాస్ తో ప్రేమ లేదని చెప్పడంతో వారు ఒకింత ఊపిరి పీల్చుకున్నారు. ప్రభాస్ ప్రస్తుత వయసు 42 ఏళ్ళు కాగా హీరోయిన్ అనుష్కను వివాహం చేసుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.