Bigg Boss 6 Telugu Siri-Shrihan: బిగ్ బాస్ వేదికగా ఓ సంచలన విషయం చోటు చేసుకుంది. ఓ మూడేళ్ళ కుర్రాడు శ్రీహాన్ ని డాడీ అని పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫ్యామిలీ వీక్ లో భాగంగా కంటెస్టెంట్స్ ని కలిసేందుకు కుటుంబ సభ్యులు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. కాగా శ్రీహాన్ కోసం లవర్ సిరి ఎంట్రీ ఇచ్చింది. మూడు నెలల విరహ వేదన తీర్చేసుకుంది. ముద్దులు, హగ్గులతో ముంచెత్తింది. శ్రీహాన్ ప్రేమకు గుర్తుగా సిరి అతని పేరు టాటూగా వేయించుకుంది. వీపుపై ఉన్న టాటూను శ్రీహాన్ కి చూపించి సర్ప్రైజ్ చేసింది. తన పేరు ప్రేయసి ఒంటిపై చూసి శ్రీహాన్ మురిసిపోయాడు.

అయితే సిరితో పాటు శ్రీహాన్ కి ఇష్టమైన మరో గెస్ట్ వచ్చారు. ఆ లిటిల్ గెస్ట్ ని చూసి శ్రీహాన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ మూడేళ్ళ బాలుడు శ్రీహాన్ ని డాడీ అంటున్నాడు. సిరిని మమ్మీ అంటున్నాడు. ఈ పరిణామం ఆడియన్స్ లో కొత్త సందేహాలకు తావిచ్చింది. సిరి-శ్రీహాన్ లను అమ్మానాన్న అంటున్న ఈ కుర్రాడు ఎవరు ? వారికి ఏమవుతాడు? వారికి అంత దగ్గరైన ఈ పిల్లాడు నిజంగానే వాళ్ళ కొడుకా? అని జుట్టు పీక్కుంటున్నారు. దీంతో పిల్లాడి గురించి విచారణ చేయగా వివరాలు తెలిశాయి.
ఆ బాలుడు సిరి మేనమామ కొడుకు. అతన్ని ఆమె దత్తత తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో అతడు సిరి లవర్ శ్రీహాన్ కి కూడా దగ్గరయ్యాడు. చిన్నప్పటి నుండి వాళ్ళ వద్దే పెరగడంతో శ్రీహాన్ ని డాడీ, సిరిని మమ్మీ అని పిలుస్తున్నాడు. గత సీజన్లో పాల్గొన్న సిరి ఒకటి రెండు సందర్భాల్లో ఈ కుర్రాడి గురించి మాట్లాడింది. కడుపున పుట్టకపోయినా… వాడు నా కొడుకు అని చెప్పుకొచ్చింది. ఇక సిరి తల్లిగారైన శ్రీదేవి బాలుడి వివరాలు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

వాడు నా తమ్ముడు కొడుకు. సిరి వద్దనే పెరుగుతున్నాడు. సిరి వాడిని దత్తత తీసుకుంది. ఆ పిల్లాడు అంటే ఆమెకు ప్రాణం అని సిరి తల్లి శ్రీదేవి చెప్పుకొచ్చారు. ఆ విధంగా సిరి-శ్రీహాన్ భార్యాభర్తలు కాకుండానే తల్లిదండ్రులు అయ్యారు. ఇక హౌస్లో ఆ బుడ్డోడు చేసిన అల్లరి హైలెట్ అయ్యింది. కంటెస్టెంట్స్ ని ఇమిటేట్ చేస్తూ నవ్వులు పూయించారు. వాడి ఎనర్జీ ఆడియన్స్ ని ఫిదా చేసింది. అయితే శ్రీహాన్ తో సన్నిహితంగా ఉంటున్న శ్రీసత్యకు సిరి చురకలు వేసింది. సైలెంట్ గా వార్నింగ్ ఇచ్చింది. సిరి మాటల్లో శ్రీసత్యపై ఉన్న అసహనం బయటపడింది.